గీతార్థ సంగ్రహం – 4

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

గీతార్థ సంగ్రహం

<< గీతార్థ సంగ్రహం – 3

రెండవ షట్కము (7 – 12 అధ్యాయముల) యొక్క సారాంశం

11 వ శ్లోకం:

స్వయాథాత్మ్యం ప్రకృత్యాస్య తిరోధిః శరణాగతిః |

భక్త భేదః ప్రబుద్ధస్య శ్రైష్ఠ్యం సప్తమ ఉచ్యతే ||

Nammazhwarనమ్మాళ్వార్ – ఙ్ఞానులలో అగ్రగణ్యులు

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

సప్తమే :  ఏడవ అధ్యాయంలో

స్వయాథాత్మ్యం :  పరమపురుషుని యొక్క నిజ స్వరూపము, అనగా స్వయంగా అతడే (భగవానుడే) ఉపాసనా (భక్తి) వస్తువు (లేదా ఉపాసించబడువాడు).

ప్రకృత్యా :  మూల ప్రకృతిచే (ప్రధాన పదార్థముచేత)

అస్య తిరోధిః :  (ఆ జ్ఞానం) మరుగుపడి ఉంది (జీవాత్మ కోసం)

శరణాగతిఃశరణాగతిచేయుట (ఇది మరుగుపడి వుండుటను నిర్మూలిస్తుంది)

భక్త భేదః : భక్తుల యొక్క (నాలుగు) రకములు (భేదములు)

ప్రబుద్ధస్య శ్రైష్ఠ్యంఙ్ఞాని యొక్క గొప్పతనము

ఉచ్యతే : చెప్పబడెను

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఏడవ అధ్యాయంలో, పరమపురుషుని యొక్క నిజ స్వరూపము, అనగా స్వయంగా అతడే (భగవానుడే) ఉపాసనా (భక్తి) వస్తువు (లేదా ఉపాసించబడువాడు), అది (భగవంతుని గురించి జ్ఞానం)  మూల ప్రకృతిచే (జీవాత్మ కోసం) మరుగుపడుట, భగవంతుని శరణాగతిచేయుట (ఇది మరుగుపడి వుండుటను నిర్మూలిస్తుంది), నాలుగు రకముల భక్తులు, (ఆ నాలుగు రకముల భక్తులలో) ఙ్ఞాని యొక్క గొప్పతనము చెప్పబడెను.

 

12 వ శ్లోకం:

ఐశ్వర్యాక్షరయాథాత్మ్య భగవచ్ఛరణార్థినాం |

వేద్యోపాదేయభావానాం అష్టమే భేద ఉచ్యతే ||

paramapadhanathanపరమపధంలో భగవానుని సేవ చేయడమే అత్యున్నతమైన లక్ష్యము

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఐశ్వర్య అక్షర యాథాత్మ్య భగవచ్ఛరణార్థినాం  : మూడు రకములైన భక్తులకు, ఐశ్వర్యార్తి – భౌతిక సంపదను కోరుకునేవారు, కైవల్యార్తి – భౌతికమైన శరీరం నుండి విముక్తి పొందిన తరువాత ఆనందమును కోరుకునేవాడు, ఙ్ఞాని – భగవంతుని యొక్క పాద పద్మాలను సాధించాలని కోరుకునేవాడు

వేద్య ఉపాదేయ భావానాం  :  అర్థమును గ్రహించి, సాధన చేయవలసిన ఆ సూత్రాలను

భేదమ్  : వివిధ రకములు

అష్టమే  : ఎనిమిదవ అధ్యాయమునందు

ఉచ్యతే  : చెప్పబడెను

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఎనిమిదవ అధ్యాయమునందు, మూడు రకములైన భక్తులు ఐశ్వర్యార్తి – భౌతిక సంపదను కోరుకునేవాడు, కైవల్యార్తి – భౌతికమైన శరీరం నుండి విముక్తి పొందిన తరువాత ఆనందమును కోరుకునేవాడు, ఙ్ఞాని – భగవంతుని యొక్క పాద పద్మాలను సాధించాలని కోరుకునేవాడు మున్నగువారు, అర్థమును గ్రహించి సాధన చేయవలసిన వివిధ సూత్రములు, చెప్పబడెను

 

13 వ శ్లోకం:

స్వమాహాత్మ్యం మనుష్యత్వే పరత్వం చ మహాత్మనాం |

విశేషో నవమే యోగో భక్తిరూపః ప్రకీర్తితః ||

world-in-krishna-mouthశ్రీ కృష్ణుడు యశోదమ్మకు తన నోటియందే విశ్వమును చూపించుట

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

స్వమాహాత్మ్యం  :  తన యొక్క గొప్పతనమును

మనుష్యత్వే పరత్వం : మనుష్యరూపములో ఉన్నా కూడా తాను పరమాత్మగా నుండుట

మహాత్మనాం విశేషః : మహాత్ములైన ఆ ఙ్ఞానుల యొక్క గొప్పతనము (వీటితో పాటుగా)

భక్తిరూప యోగః : భక్తి యోగముగా పిలవబడే ఉపాసనము

నవమే : తొమ్మిదవ అధ్యాయంలో

ప్రకీర్తితః : చక్కగా వివరించబడెను

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

తొమ్మిదవ అధ్యాయంలో, తన యొక్క గొప్పతనమును, తాను పరమాత్మ అయినా మనుష్యరూపములో కూడా, మహాత్ములైన ఆ ఙ్ఞానుల యొక్క గొప్పతనము (వీటితో పాటుగా) భక్తి యోగముగా పిలవబడే ఉపాసనము,  చక్కగా వివరించెను.

 

14 వ శ్లోకం:

స్వకల్యాణగుణానంత్య కృత్స్న స్వాధీనతామతిః |

భక్త్యుత్పత్తి వివృద్ధ్యర్థా విస్తీర్ణా దశమోదితా ||

bhagavan

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

భక్తి ఉత్పత్తి వివృద్ధి అర్థా  :  సాధనా పూర్వక భక్తి (భగవంతుని చేరుటకు భక్తి యోగము యొక్క ప్రక్రియ) కలిగి (జనియించి) అది వృద్ధియగుటకై,

స్వకల్యాణ గుణ అనంత్య కృత్స్న స్వాధీనతా మతిఃఅపారమయిన తన శుభ లక్షణాల స్వభావమును, సర్వము ఆతని స్వాధీనమున వున్నదను జ్ఞానము,

విస్తీర్ణావిపులముగా

దశమోదితాపదవ అధ్యాయంలో వివరించెను.

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

సాధనా పూర్వక భక్తి (భగవంతుని చేరుటకు భక్తి యోగము యొక్క ప్రక్రియ) కలిగి (జనియించి) అది వృద్ధియగుటకై, భగవంతుని అపారమయిన తన శుభ లక్షణాల స్వభావము, సర్వము ఆతని స్వాధీనమున వున్నదను జ్ఞానము, విపులముగా పదవ అధ్యాయంలో వివరించెను.

 

15 వ శ్లోకం:

ఏకాదశే స్వయాథాత్మ్య సాక్షాత్కారావలోకనం |

దత్తముక్తం విదిప్రాప్త్యోర్భక్త్యేకోపాయతా తథా ||

viswarupam

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఏకాదశే  :  పదకొండవ అధ్యాయంలో

స్వ యాథాత్మ్య సాక్షాత్కార అవలోకనం  :  తనను నిజముగా (నిజస్వరూపమును) చూచుటకై దివ్య కన్నులు

దత్తం ఉక్తం  :  అవి (ఆ కన్నులు) (శ్రీకృష్ణుడు అర్జునికి) ఇచ్చెనని చెప్పబడినది

తథా  :  అదేవిధముగా

విది ప్రాప్త్యోః  :  (భగవానుని) తెలుసుకొనుట, (చూచుట),  (సాన్నిధ్యమును) చేరుట, మొదలైనవి పొందుటకు

భక్తి ఏక ఉపాయతా  :  కేవలము భక్తి మాత్రమే మార్గముగా

ఉక్తమ్  :  చెప్పబడినది

 

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పదకొండవ అధ్యాయంలో, భగవానుని నిజముగా (నిజస్వరూపమును) చూచుటకై దివ్య కన్నులు (శ్రీకృష్ణుడు అర్జునికి) ఇచ్చెనని చెప్పబడినది, అదేవిధముగా భగవానుని తెలుసుకొనుట, (చూచుట),  (సాన్నిధ్యమును) చేరుట, మొదలైనవి పొందుటకు కేవలము భక్తి మాత్రమే మార్గముగా చెప్పబడినది.

 

16 వ శ్లోకం:

భక్తేః శ్రైష్ఠ్యముపాయోక్తిరశక్తస్యాత్మనిష్ఠతా |

తత్ప్రకారాస్త్వతిప్రీతిర్ భక్తే ద్వాదశ ఉచ్యతే ||

krishna-vidhuraశ్రీ కృష్ణుడు విదురుని పట్ల మిక్కిలి ఆప్యాయత చూపించుట

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

భక్తేః శ్రైష్ఠ్యంభగవంతుని చేరుటలో, ఆత్మ ఉపాసన (తమ ఆత్మను సిద్ధించుకొనుటయందే నిమఘ్నమగుట) తో పోల్చినపుడు భక్తి యోగము యొక్క గొప్పతనమును.

ఉపాయ ఉక్తిఃఅటువంటి భక్తిని పొందుటకు మార్గాలను వివరించుచున్నది

అశక్తస్య  :  అంతటి భక్తిని పొందుటకు సామర్ధ్యం లేని వారికి

ఆత్మ నిష్ఠతా :  శుద్ధాత్మ స్వస్వరూప ప్రాప్తి (ఆత్మ ఉపాసన)

తత్ ప్రకారాఃకర్మ యోగ  సాధనకు అవసరమైన గుణములు మొదలైనవి

భక్తే అతిప్రీతిః తుభగవంతుడు తన భక్తులపట్ల అమితమైన ప్రేమ కలిగియుండుట

ద్వాదశే  :  పన్నెండవ అధ్యాయమునందు

ఉచ్యతేచెప్పబడినది

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పన్నెండవ అధ్యాయమునందు, భగవంతుని చేరుటలో, ఆత్మ ఉపాసనతో (తమ ఆత్మను సిద్ధించుకొనుటయందే నిమఘ్నమగుట) పోల్చినపుడు భక్తి యోగము (భగవానుని ఉపాసన) యొక్క గొప్పతనమును, అటువంటి భక్తిని పొందుటకు మార్గాలను వివరించుచున్నది, అంతటి భక్తిని పొందుటకు సామర్ధ్యం లేని వారికి (ఆత్మ నిష్ఠ) శుద్ధాత్మ స్వస్వరూప ప్రాప్తి, కర్మ యోగ  సాధనకు అవసరమైన గుణములు మొదలైనవి,  భగవంతుడు తన భక్తులపట్ల అమితమైన ప్రేమ కలిగియుండుట, చెప్పబడినది.

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్

మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-4/

archived in http://githa.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *