గీతార్థ సంగ్రహం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

githacharya-2

alavandhar-emperumanarయమునాచార్యులు – శ్రీ రామానుజులు

Audio recording of all SlOkams

e-book –

యత్ పదాంభోరుహధ్యాన విధ్వస్తాశేష కల్మష: |
వస్తుతాముపయా దోహమ్ యామునేయం నమామితమ్ ||

Listen

యమునాచార్యుల పాద పద్మములను ధ్యానించుట వలన నా పాపములన్నియు తొలగింపబడెను, నేను తెలుసుకొనదగిన వస్తువుని అయ్యాను (అనగా అంతకుమునుపు అసత్తు (పదార్ధమ్) గా  వున్న నాకు సత్తు (ఆత్మ) ననే ఙ్ఞానం కలిగింది) అటువంటి యమునాచార్యులకు నేను నమస్కరించుచున్నాను.

 యమునాచార్యులను కీర్తిస్తూ రామానుజులు రచించిన ప్రార్థనా పూర్వక శ్లోకం

శ్రీమన్ నాథముని మనుమడైన ఆళవందార్ (యమునాచార్య), వేదవేదంగాలలో నిష్ణాతుడు. ఈ శాస్త్రాలను విషదీకరిస్తూ తను రచించిన పలు గ్రంధాల ద్వారా శ్రీవైష్ణవ సత్సాంప్రదాయానికి పునాధులు వేశారు. అటువంటి ఒక దివ్యగ్రంధమే గీతార్థ సంగ్రహం.

సంస్కృత శ్లోక ప్రబంధమైన గీతార్థ సంగ్రహం, 32 శ్లోకాలలో భగవధ్గీత యొక్క సందేశాన్ని  (ఉపదేశాన్ని) తెలియజేస్తుంది. ఈ శ్లోకాలను క్రింది విధముగ విభాగం చేయవచ్చు.

పుత్తూరు “సుదర్శనులు” శ్రీ ఉ. వే. కృష్ణమాచార్య (కృష్ణస్వామి ఇయ్యెంగార్) తమిళంలో ఈ గీతార్థ సంగ్రహం శ్లోకాలకు ప్రతిపదార్థ తాత్పర్యాలను రచించారు. దీని ఆధారంగా రచింపబడిన ఆంగ్ల అనువాదం సహాయంతో మనము ఈ ప్రబంధపు ప్రతి విభాగము యొక్క తెలుగు అనువాదాన్ని పరిశీలిద్దాము.

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్

మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham/

పొందుపరిచిన స్థానము http://githa.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org