శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
తాన్ సమీక్ష్య స కౌన్తేయః సర్వాన్ బన్ధూనవస్థితాన్ ॥
ప్రతి పదార్థం
ఉభయోః సేనయోః అపి – రెండు సైన్యములలోనూ ఉన్న
శ్వశురాన్ – మామగార్లను (ద్రుపదుడు మొదలైనవారిని)
సుహృదః చ ఏవ – శ్రేయోభిలాషులను, హితైషులను కూడా
సః కౌన్తేయః – ఆ కుంతీపుత్రుడైన అర్జునుడు
అవస్థితాన్ – యుద్ధమునకు సిద్ధపడి నిలిచియున్న
తాన్ సర్వాన్ బన్ధూన్ – ఆ బంధువులందరినీ
సమీక్ష్య – బాగుగా చూచి / గమనించి
తాత్పర్యం
కుంతీపుత్రుడైన అర్జునుడు, రెండు సైన్యాలలోనూ ఉన్న తన మామగార్లను (శ్వశురులను) మరియు శుభచింతకులను చూచెను. అక్కడ యుద్ధం చేయడానికి సంసిద్ధులై వేచియున్న ఆ బంధువులందరినీ అతడు చక్కగా గమనించెను.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-27
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org