శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
సీదన్తి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥
ప్రతి పదార్థం
మమ – నా యొక్క
గాత్రాణి – అవయవములు
సీదన్తి – పట్టుతప్పి పోవుచున్నవి (శిథిలమగుచున్నవి)
ముఖం చ – నోరు కూడా
పరిశుష్యతి – ఎండిపోవుచున్నది
మే శరీరే – నా శరీరంలో
వేపథుః చ – వణుకు కూడా
రోమహర్షః చ – గగుర్పాటు (రోమాంచము) కూడా
జాయతే – కలుగుచున్నది
తాత్పర్యం
నా అవయవాలన్నీ శక్తిహీనమై పోతున్నాయి, నా నోరు పూర్తిగా ఎండిపోతోంది, నా శరీరం వణుకుతోంది మరియు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి (గగుర్పాటు కలుగుతోంది).
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-29
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org