1.35 – ఏతాం న హంతుమిచ్ఛామి

 శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.34

శ్లోకం

ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోऽపి మధుసూదన |

అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ||

ప్రతి పదార్థం

మధుసూదన – ఓ మధుసూదనా ! (మధు అనే రాక్షసుడిని సంహరించినవాడా)

ఘ్నతః అపి – ఒకవేళ వారు నన్ను చంపాలని అనుకున్నప్పటికీ 

ఏతాన్ – వీరిని

హంతుం న ఇచ్ఛామి – చంపాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు

త్రైలోక్య రాజ్యస్య అపి హేతోః – ముల్లోకాలను పరిపాలించే భాగ్యం లభించినప్పటికీ

కిం ను మహీకృతే – కేవలం ఈ భూమండలాన్ని పరిపాలించడం కోసం నేను ఎందుకు చంపుతాను ? 

తాత్పర్యం

ఓ మధుసూదనా! ఒకవేళ వారు నన్ను చంపాలని అనుకున్నప్పటికీ, నేను వారిని చంపను. ముల్లోకాలను పరిపాలించే భాగ్యం లభించినప్పటికీ వారిని చంపాలనే కోరిక నాకు ఏమాత్రం లేదు, అలాంటప్పుడు కేవలం ఈ భూమండలాన్ని పరిపాలించడం కోసం నేను వారిని ఎందుకు చంపుతాను?

అడియేన్ ఆముక్త రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 36

మూలము : https://githa.koyil.org/index.php/1-35

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org