1.22 యావద్ ఏతన్

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం – 1

<< అధ్యాయం 1, శ్లోకం 21

శ్లోకం 

యావదేతాన్ నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ ।

కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణసముద్యమే ॥

ప్రతి పదార్థం 

యోద్ధుకామాన్ – యుద్ధం చేయాలనే తీవ్ర కాంక్షతో

అవస్థితాన్ – ఎదురుగా నిలబడి ఉన్నటువంటి

ఏతాన్ – ఈ దుర్యోధనాదులను (కౌరవ పక్ష యోధులందరినీ)

యావత్ నిరీక్షే – నేను కళ్లారా చూసేవరకు

అస్మిన్ రణసముద్యమే – ఈ మహాయుద్ధ ప్రయాసలో

మయా – నా చేత / నా ద్వారా

కైః సహ యోద్ధవ్యం – ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉందో

యావత్ నిరీక్షే – వారిని నేను స్పష్టంగా చూసేంతవరకు (నా రథాన్ని నిలపవయ్యా!)

తాత్పర్యం 

యుద్ధం చేయాలనే కాంక్షతో నా ఎదుట నిలబడి ఉన్న ఈ దుర్యోధనాదులను నేను చూసేంతవరకు, మరియు ఈ యుద్ధ ప్రయత్నంలో నేను ఎవరెవరితో పోరాడవలసి ఉందో వారిని నేను స్పష్టంగా తిలకించేవరకు (నా రథాన్ని ఆ ప్రదేశంలో నిలపవయ్యా!).

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 23

మూలము : https://githa.koyil.org/index.php/1-22/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org