శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
క్లైబ్యం మా స్మ గమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప ||
ప్రతి పదార్థం
పార్థ – ఓ కుంతీపుత్రా! (అర్జునా!)
క్లైబ్యమ్ – పిరికితనమును
మా స్మ గమః – పొందవద్దు (చేరవద్దు)
ఏతత్ – ఇది
త్వయి – నీయందు
న ఉపపద్యతే – తగదు (శోభించదు)
పరన్తప – శత్రువులను తపింపజేసేవాడా! (ఓ శత్రుంజయా!)
క్షుద్రమ్ – తుచ్ఛమైన / అల్పమైన
హృదయ-దౌర్బల్యమ్ – మనస్సు యొక్క బలహీనతను
త్యక్త్వా – విడిచిపెట్టి
ఉత్తిష్ఠ – లెమ్ము! (యుద్ధానికి సిద్ధంకమ్ము!)
తాత్పర్యం
ఓ కుంతీపుత్రా! పిరికితనాన్ని ఆశ్రయించకు (స్వీకరించకు). ఏలయనగా, అది నీ స్వరూపానికి ఎంతమాత్రమూ శోభించదు. శత్రువులను సంహరించే ఓ వీరుడా! శక్తిహీనమైన ఈ మనోదౌర్బల్యాన్ని విడిచిపెట్టి, లెమ్ము.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/2-3
పొందుపరచిన స్థానము – https://githa.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org