శ్రీ భగవద్ గీతా సారం – 4 వ అధ్యాయం (జ్ఞాన యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 3

గీతార్థ సంగ్రహం లోని 8 వ శ్లోకం లో, ఆళవందార్లు 4వ అధ్యాయం యొక్క సారాంశం ఇలా వివరిస్తున్నారు “ 4 వ అధ్యాయం, కర్మ యోగం (జ్ఞాన యోగం తో కూడినది) జ్ఞాన యోగం గానే చెప్పబడ్తునది, కర్మ యోగం యొక్క స్వభావం మరియు విభాగాలు, నిజమైన జ్ఞానం యొక్క వైభవం మరియు (ప్రారంభం లో , వారి మాటలు నిర్ధారించే విధముగా) తన గుణాల గూర్చి ఆవశ్యకమైన ఉపన్యాసం ఇస్తున్నారు (అవతారాలు ఎత్తినా మారని గుణాలు) ఇక్కడ వివరించటం జరిగింది.

ముఖ్యమైన శ్లోకలు

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం । వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవేఽబ్రవీత్ ॥

కృష్ణుడు చెప్తూ, నేను ఈ నాశనమవని కర్మ యోగాన్ని సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు దీన్ని మనువు కి, మనువు ఇక్ష్వాకు కి నేర్పించాడు.

వివరణం : కృష్ణుడు, మొదటి 3 శ్లోకాల్లో తన బోధనలు ప్రాచీనమైనవి మరియు వాటి ప్రామాణికతను స్థాపిస్తున్నాడు. జ్ఞానం ఒక పరంపర ద్వారా ఎలా ప్రసరించిందో మరియు లుప్తం అయ్యిందో కూడా వివరించారు. 4వ శ్లోకం లో అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తూ ఒకవేళ కృష్ణుడు ఇప్పటి వాడు అయితే ఈ సనాతన జ్ఞానాన్ని పూర్వం లో ఎలా బోధించాడో అడిగాడు. దానికి కృష్ణుడు తర్వాత 4 శ్లోకాల్లో తన అవతారాల్ని గూర్చిన అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని వివరిస్తున్నారు.

శ్లోకం 5

శ్రీ భగవాన్ ఉవాచ. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున । తాన్యహం వేద సర్వాణి నా త్వం వేత్త పరంతప ॥

కృష్ణుడు బదులు ఇస్తూ, ఓ అర్జునా! నీకు లాగానే నాకు కూడా అగణ్యమైన జన్మలు సంభవించాయి. ఓ! శత్రు సంహారుడా! నాకు ఆ జన్మలు అన్ని తెలుసు (నావి నీవి కూడా) కానీ నీకు ఏవి తెలీదు.

వివరణం : భగవంతుడు తన సర్వశ్రేష్ఠత్వాన్ని మరియు అర్జునుడి నిమ్న భావాన్ని వివరిస్తున్నారు.

శ్లోకం 6

అజోఽపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోఽపి సన్ । ప్రకృతిం స్వామ్ అధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥

జన్మరాహిత్యం మరియు నిత్యత్వం కలిగిన వాడినై, సర్వజీవుల ప్రభువై ఉండి, నేను అనేకమైన జన్మల్లో అనేక రూపాలుగా అవతారాలని నా ఇచ్చా ద్వారా స్వీకరిస్తాను(పవిత్రమైన అప్రాకృతమైన శరీరం).

వివరణం : భగవంతుడు తాను ఈ ప్రపంచం లో అవతరించినప్పుడు, తన ఇచ్ఛ చేత మరియు తన అప్రాకృతమైన రూపం తో అవతరిస్తారు.

శ్లోకం 7

యదా యదా హి ధర్మస్య గ్లానిర్ భవతి భారత । అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం ॥

ఓ భరత వంశజుడా ! ఎప్పుడు అయితే ధర్మం నశిస్తుందో మరియు అధర్మం ప్రభలుతున్దో, ఆ సమయం లో నన్ను నేను సృజించుకుంటాను [వివిధ అవతారాల్లో ప్రకటమవుతాను].

వివరణం : భగవాన్ తన ఇష్టం ప్రకారం, ఎప్పడు అయితే అవసరం అనుకుంటారో అప్పుడు అవతరిస్తారు.

శ్లోకం 8

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం । ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥

నేను అనేక విధాలుగా అనేక యుగముల్లో అవతరించాను, ధార్మికులని రక్షించటానికి, దుష్టులని హింసించడానికి మరియు నశింపచెయ్యటానికి; ధర్మాన్ని బలముగా స్థాపించటానికి (గుణములు)

వివరణం : అవతరించటానికి మూడు కారణాలు గుర్తించినప్పటికీ, ధార్మికులకి తన స్వరూపం చూపి ధార్మికులని రక్షించటం వాటిలో ప్రధానమైన లక్ష్యం, ఎందుకు అంటే మిగిలిన రెండు వారు అవతరించక పోయిన వారి దివ్యాజ్ఞ చేత సంపన్నం అవుతుంది.

శ్లోకం 9

జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్త్వతః । త్యక్త్వ దేహం పునర్ జన్మ నైతి మామ్ ఏతి సోఽర్జున ॥

ఓ అర్జున ! ఎవరైతే నా అప్రాకృతమైన/దివ్యమైన అవతారాలని మరియు చేష్టితములు ధ్యానిస్తారో ముందు చెప్పిన విధముగా, వారు ప్రస్తుత శరీరం త్యజించి తిరిగి మరో జన్మ పొందడు, కానీ నన్ను చేరుతారు.

వివరణం : భగవంతుడి అవతారాల మరియు కార్యాల వెనుక ఉన్న నిజమైన జ్ఞానమే భగవంతుడిని పొందటం.

శ్లోకం 11

యే యతా మామ్ ప్రాపద్యంతే తామ్స్ తథైవ భజామ్యహం । మామ వర్త్మనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ॥

నేను నా శరణాగతులని వారు కోరిన విధములోనే చేరుతాను, వారు కోరిన మార్గములోనే చేరుతాను(నన్ను నేను లభ్యం చేస్తాను). ఓ పృథా కుమారుడా (కుంతి)! సమస్త జనములు నా గుణాలను పలు పలు విధాలుగా అనుభవిస్తూ జీవిస్తారు.

వివరణం : భక్తులు వారి కోరిక మేరకు ప్రతిష్టించిన అర్చా విగ్రహములు ఇక్కడ ప్రస్తావించటం జరుగుతుంది. అటు తర్వాత శ్లోకం లో, భగవాన్, ఎలా తన అవతార రహస్యాలు తెలుసుకొనుట చేత మోక్షం సిద్ధిస్తుంది అని వివరిస్తున్నారు.

తర్వాత ఆరు శ్లోకాల్లో, జ్ఞానం తో కూడిన కర్మ యోగం యొక్క పరిచయం చేస్తున్నారు.

శ్లోకం 13

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః । తస్య కర్తారం అపి మామ్ విద్ధ్యాకర్థారం అవ్యయం ॥

నాలుగు వర్ణాలు కలిగిన లోకాలన్నీ సర్వేశ్వరుడు అయిన నాచే సృజించబడ్డాయి, వాటికి ఆధారాలు గుణం (సత్త్వ, రాజస్ మరియు తమస్) మరియు కర్మ ఆధారమైన విభజనం లో శమ(మనసు పైన నియంతృత్వం) మరియు ధమ (ఇంద్రియ నిగ్రహం). నేను ఈ అందమైన సృష్టికి సృష్టికర్త అయినప్పటికీ నేను ఈ సృష్టి లోని అవకతవకలకు సృష్టికర్త ను కాను మరియు ఈ కారణం చేత దోష రహితుడను.

వివరణం : ఈ శ్లోకం యొక్క సందర్భం వర్ణ వ్యవస్థ వివరించటం కాదు, ఈ అవకతవకలకు భగవంతుడు సంబంధం లేని విషయాన్ని వివరిస్తుంది. వర్ణం శరీరానికి తప్ప ఆత్మకు కాదు కాబట్టి మన ఆచార్య పురుషులు ఎప్పుడు ఎవరి వర్ణాలు మార్చే ప్రయత్నం చెయ్యలేదు , దానికి బదులు భగవతుణ్ణి పట్ల స్వచమైన ప్రేమని పెంపొందించారు మరియు నిత్య కైంకర్యం పైనే దృష్టి సారించారు.

రాబోవు శ్లోకాల్లో భగవంతుడు ఎలా కర్మ యోగం కూడా జ్ఞాన యొక్క రూపమే అన్న విషయాన్ని వివరించారు.

శ్లోకం 22

యాదృచ్ఛలాభసంతుష్టో ధ్వంధ్వాతీతో విమత్సరః । సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి నా నిబధ్యతే ॥

ఎవరైతే వారికి దొరికిన వాటితో సంతుష్టుడు అవుతాడో (శరీరం నిలుపోకోవటానికి), ద్వంద్వాలని సహిస్తాడో (సుఖ-దుఖాలు; చలి-వేడి), ఇతరులు పట్ల ఈర్ష లేకుండా, జయ-అపజయాల లో ఒకేలా ఉండి, కర్మ చేస్తూ (జ్ఞానం లేనప్పటికి), అటువంటి వారు ఈ సంసారం లో బద్దులు అవ్వరు.

వివరణం : తర్వాత శ్లోకం లో, ఎవరు అయితే యజ్ఞము వంటి కర్మలు ఫలాపేక్ష లేకుండచేస్తారో, వారి పుణ్య/పాపాలు నష్టం అవుతాయి అని వివరించారు.

ఇక మిగిలిన శ్లోకాల్లో, కర్మ యోగం యొక్క రకాలు మరియు కర్మ యోగ అంతర్గతం అయినా జ్ఞానం యొక్క వైభవం వివరించబడింది.

శ్లోకం 34

తద్విద్ధి ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవయా । ఉపదేశ్క్ష్యంతితే జ్ఞానం జ్ఞానినస్ తత్త్వదర్శినః ॥

సర్వోత్కృష్ఠమైనా ఈ జ్ఞానం నేర్చుకోవటానికి(జ్ఞానుల వద్ద) ప్రణామం చెయ్యాలి, వారిని సమర్యాద పూర్వకంగా ప్రశ్నించి; అటువంటి జ్ఞానులు ఆత్మ జ్ఞానం పొందిన వారు (ఆరాధనం చేత ప్రీతి చెందిన వారు) ఆత్మ జ్ఞానం నీకు బోధిస్తారు.

వివరణం : ఇక్కడ వినయ పూర్వకముగా ఒక సదాచార్యుల వద్ద నేర్చుకొవుటం గురించి చెప్పబడింది.

శ్లోకం 38

నా హి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యాతే । తత్ స్వయం యోగాసంసిద్ధః కాలేనాత్మని విందతి ॥

ఈ ప్రపంచం లో, ఆత్మ జ్ఞానం పొందటం కన్నా పవిత్ర పరిచేది లేదు. ఎవరు అయితే కర్మయోగం లోని జ్ఞానాన్ని పొందుతారో, వారు ఆత్మ జ్ఞానం పొందుతారు.

శ్లోకం 42

తస్మాత్ అజ్ఞాన సంభూతం హృత్సతం జ్ఞానసినాత్మనః. । చిత్వైనం సంశయమ్ యోగం ఆతిష్టోత్తిష్ట భారత ॥

ఓ! భరత వంశజుడా, ఎవరు కూడా ముందు చెప్పిన కర్మ యోగం వల్ల మోక్షం సిద్ధించదు [కేవలం జ్ఞానం లేని కర్మల ద్వారా]జ్ఞానం అనే ఖడ్గం తో ఆత్మ విషయం లో అనుమానాల్ని ఖండించి, లేచి కర్మా యోగం పాటించు.

వివరణం : కాబట్టి కర్మ యోగం యొక్క ముఖ్యమైన భాగం జ్ఞానం గురించి చెప్తూ జ్ఞానం వైభవాన్ని. ఇక్కడ వివరిస్తున్నారు.

ఆడియెన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-4/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org