శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
మూడు షట్కముల యొక్క సారాంశం – 2 నుండి 4 వ శ్లోకం
2 వ శ్లోకం:
ఙ్ఞాన కర్మాత్మికే నిష్ఠే యోగలక్ష్యే సుసంస్కృతే |
ఆత్మానుభూతి సిధ్యర్థే పూర్వ షట్కేన చోదితే ||
Listen
ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
సుసంస్కృతే : చక్కగా సంస్కరింపబడిన (శేషత్వఙ్ఞానముతో – దాస్యత్వము గురించిన ఙ్ఞానము కలియుండుట, ప్రాపంచిక విషయముల పట్ల అనాసక్తతతో వుండుట, మొదలగునవి)
ఙ్ఞాన కర్మాత్మికే నిష్ఠే : ఙ్ఞాన యోగము (సహజమైన ఙ్ఞాన మార్గము) మరియు కర్మయోగము (శాస్త్రములు నిర్దేషించిన కర్మాచరన మార్గము)
యోగలక్ష్యే : యోగమును సాధించుటకై (ఆత్మ సాక్షాత్కారము – శుద్ధాత్మ స్వస్వరూప ప్రాప్తి)
ఆత్మానుభూతి సిధ్యర్థే : (మరియు మరింత) ఆత్మానుభవము (స్వీయ ఆనందానుభవం) సాధించడానికి
పూర్వ షట్కేన : మొదటి షట్కమున (ఆరు అధ్యాయములు)
చోదితే : వివరించబడినది
సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
మొదటి షట్కములో (ఆరు అధ్యాయములలో) ఙ్ఞానయోగము మరియు కర్మయోగ మార్గములు వివరించబడినది. ఈ యోగములు (శేషత్వఙ్ఞానముతో – అనగా దాస్యత్వము గురించిన ఙ్ఞానము కలియుండుట, ప్రాపంచిక విషయముల పట్ల అనాసక్తతతో వుండుట, మొదలగునవి) సంస్కరింపబడినవై ఆత్మ సాక్షాత్కారము (శుద్ధాత్మ స్వస్వరూప ప్రాప్తి) మరియు ఆత్మానుభవము (స్వీయ ఆనందానుభవం) సిద్ధించుటకు సాధనములుగ చెప్పబడెను.
3 వ శ్లోకం:
మధ్యమే భగవత్తత్వ యాథాత్మ్యావాప్తి సిద్ధయే |
ఙ్ఞానకర్మాభి నిర్వర్త్యో భక్తియోగః ప్రకీర్తితః ||
Listen
ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
మధ్యమే : మధ్యమ షట్కమున (ఆరు అధ్యాయములు)
భగవత్తత్వ యాథాత్మ్యావాప్తి సిద్ధయే : భగవానుడయిన ఆ పరమాత్మ యొక్క యదార్థ తత్వాన్ని సిద్ధించుకొనుట.
ఙ్ఞానకర్మాభి నిర్వర్త్య : ఙ్ఞానముతో కూడిన కర్మయోగము చేత వృద్ధిచెందునది
భక్తి యోగః : భక్తియోగము
ప్రకీర్తితః : చెప్పబడెను
సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
మధ్యమ షట్కములో (ఆరు అధ్యాయములలో), ఙ్ఞానముతో కూడిన కర్మయోగము చేత వృద్ధిచెందునది, భగవానుడయిన ఆ పరమాత్మ యొక్క యదార్థ తత్వాన్ని సిద్ధించుకొనుట సాధనమైన భక్తియోగము చెప్పబడెను
4 వ శ్లోకం:
ప్రధాన పురుష వ్యక్త సర్వేశ్వర వివేచనం |
కర్మ ధీర్భక్తి రిత్యాదిః పూర్వశేషోంతిమోదితః ||
Listen
ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
ప్రధాన పురుష వ్యక్త సర్వేశ్వర వివేచనం : సూక్ష్మమైన మూల ప్రకృతి (ప్రధాన పదార్థము), జీవాత్మా (జ్ఞానము), స్థూలమైన అచేతనము (జడము), సర్వేశ్వరుడైన పరమాత్మ వివరించబడెను.
కర్మ : కర్మయోగము
ధీర్ : ఙ్ఞానయోగము
భక్తి : భక్తియోగము
ఇత్యాదిః : వీనిని సాధించు ప్రక్రియ, మొదలైనవి
పూర్వశేషః : మునుపటి అధ్యాయములలో వివరింపబడని
అంతిమోదితః : చివరి షట్కములో చెప్పబడెను
సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
చివరి షట్కములో సూక్ష్మమైన మూల ప్రకృతి (ప్రధాన పదార్థము), జీవాత్మా (జ్ఞానము), స్థూలమైన అచేతనము (జడము), సర్వేశ్వరుడైన పరమాత్మ, కర్మయోగము ఙ్ఞానయోగము మరియు భక్తియోగమును సాధించు ప్రక్రియ మొదలైనవి మునుపటి అధ్యాయములలో వివరింపబడనివి ఇందు (చివరి అధ్యాయములలో) చెప్పబడెను.
అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్
మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-2/
archived in http://githa.koyil.org
pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org
audio recordnig link is moved pl restore the link
The webpage at https://yourlisten.com/embed/html5?17464384 might be temporarily down or it may have moved permanently to a new web address.