గీతార్థ సంగ్రహం – 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

గీతార్థ సంగ్రహం

<< గీతార్థ సంగ్రహం – 4

మూడవ షట్కము (7 12 అధ్యాయముల) యొక్క సారాంశం

17 వ శ్లోకం:

దేహస్వరూప మాత్మాప్తి హేతురాత్మవిశోధనమ్ |

బన్ధహేతుర్వివేకశ్చ త్రయోదశ ఉదీర్యతే ||

soul-body-difference

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

దేహ స్వరూపం  :  దేహము యొక్క స్వరూపం

ఆత్మాప్తి హేతుః  :  జీవాత్మ స్వరూపమును పొందుటకు మార్గము

ఆత్మ విశోధనమ్ఆత్మ యొక్క పరిశీలనము మరియు దానిని తెలుసుకోవడం

బన్ధ హేతుః(ఆత్మ, అచిత్తుతో (శరీరంతో)) బంధనమునకు కారణము

వివేకః చ (ఆత్మ మరియు అచిత్తు మధ్య) భేదమును చూపు పద్ధతి

త్రయోదశేపదమూడవ అధ్యాయంలో

ఉదీర్యతే  :  చెప్పబడినది

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పదమూడవ అధ్యాయంలో, దేహము యొక్క స్వరూపం, జీవాత్మ స్వరూపమును పొందుటకు మార్గము, ఆత్మ యొక్క (స్వరూప) పరిశీలనము మరియు దానిని తెలుసుకోవడం, (అచిత్తుతో (శరీరంతో) ఆత్మ యొక్క) బంధనమునకు గల కారణము, (ఆత్మ మరియు అచిత్తు మధ్య) భేదమును తెలుసుకొను వివేకము మున్నగునవి చెప్పబడినది.

18 వ శ్లోకం:

గుణబంధవిధా తేషాం కర్తృత్వం తన్నివర్తనం |

గతిత్రయస్వమూలత్వం చతుర్దశ ఉదీర్యతే ||

Vishnu-art-1

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

గుణ బంధ విధాత్రిగుణములైన సత్వ, రజో, తమో గుణములు ఏవిధముగా ఈ సంసారము (భౌతిక ప్రపంచము) నందు బంధనములో

తేషాం కర్తృత్వంఆ గుణముల స్వభావము కర్తృత్వమునకు కారణమగుట

తన్ నివర్తనం ఇటువంటి గుణములు తొలగించుకొను విధానము

గతి త్రయస్వ మూలత్వం అతడే మూడు రకాల ఫలములకు (గతి త్రయము – ఉత్తమ లోక సంపద, సిద్ధాత్మ స్వరూపానుభవము, భగవానుని పొందుట) మూలకారణమగుట

చతుర్దశే పద్నాలుగో అధ్యాయంలో

ఉదీర్యతేచెప్పబడినది

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పద్నాలుగో అధ్యాయంలో,  ఏవిధముగా త్రిగుణములైన సత్వ, రజో, తమో గుణములు ఈ సంసారము (భౌతిక ప్రపంచము) నందు బంధనములో, కర్మల యొక్క కర్తృత్వమునకు కారణ మగు ఆ గుణముల యొక్క స్వభావము, ఇటువంటి గుణములు తొలగించుకొను విధానము, అతడే (భగవానుడే) మూడు రకాల ఫలములకు (గతి త్రయము – ఉత్తమ లోక సంపద, సిద్ధాత్మ స్వరూపాను భవము, భగవానుని పాదపద్మములను చేరుకొనుట) మూల కారణమగుట మున్నగునవి చెప్పబడినది.

19 వ శ్లోకం:

అచిన్మిశ్రాద్విశుద్ధాచ్చ చేతనాత్ పురుషోత్తమః |

వ్యాపనాత్ భరణాత్ స్వామ్యాత్ అన్యః పంచదశోదితః ||

antharyami

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

అచిన్ మిశ్రాద్ (చేతనాత్) అచిత్ (భౌతిక శరీరం) చేత కూడియున్న బద్ధ జీవాత్మ కంటే ఉత్తమమైన

విశుద్ధాత్ చేతనాత్ చ  :  ప్రాకృత శరీరమును (భౌతిక శరీరం) వీడిన ముక్త జీవాత్మ కంటే ఉత్తమమైన

వ్యాపనాత్(వానియందు)  వ్యాపించిన

భరణాత్  :  (వానిని) భరించుచున్న

స్వామ్యాత్  :  (వానికి) స్వామి/ప్రభువు అయిన

అన్యః   :   వేరైనవాడిగా

పురుషోత్తమఃపురుషోత్తముడైన (అత్మల యందు ఉత్తముడు) శ్రీమన్ నారాయణుడు

పంచదశ ఉదితఃపదిహేనవ అధ్యాయంలో చెప్పబడినది

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పదిహేనవ అధ్యాయంలో, పురుషోత్తముడైన శ్రీమన్ నారాయణుని గురించి చెప్పబడినది. ఆతడు అచిత్ (భౌతిక శరీరం) చేత కూడియున్న బద్ధ జీవాత్మ మరియు ప్రాకృత శరీరమును (భౌతిక శరీరం) వీడిన ముక్త జీవాత్మ కంటే ఉత్తముడు, ఎందుకనగా ఆతడు వానికంటే వేరైన, (వానియందు) వ్యాపించిన, (వానిని) భరించుచున్న, మరియు వానికి ప్రభువు అయినవాడు.

20 వ శ్లోకం:

దేవాసుర విభాగోక్తిపూర్వికా శాస్త్రవశ్యతా |

తత్వానుష్ఠాన విఙ్ఞానస్థేమ్నే షోడశ ఉచ్యతే ||

pramanam-sastram

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

తత్వ అనుష్ఠాన విఙ్ఞానస్థేమ్నే : (సాధించవలసిన) సత్యమును గురించిన ఙ్ఞానమును స్థాపించుటకు మరియు ఆ ప్రక్రియ యొక్క అభ్యాసం (అది లక్ష్యాన్ని పొందుతుంది)

దేవ అసుర విభాగ ఉక్తి పూర్వికా : (మానవులలో) దేవతలని (దైవఙ్ఞులు), అసురులని (క్రూరమైనవారు) వర్గీకరణ తర్వాత

శాస్త్ర వశ్యతా : శాస్త్రమునకు కట్టుబడియుండుట గురించి సత్యము

షోడశేపదహారవ అధ్యాయంలో

ఉచ్యతే : చెప్పబడినది

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పదహారవ అధ్యాయంలో, (మానవులలో) దేవతలు (దైవఙ్ఞులు), అసురులు (క్రూరమైనవారు) అని వర్గీకరించిన తర్వాత, (సాధించవలసిన) సత్యమును గురించిన ఙ్ఞానమును స్థాపించుట మరియు (లక్ష్యాన్ని సిద్ధింపచేయు) ఆ తత్వము (ప్రక్రియ) యొక్క అభ్యాసం, (మానవులు) శాస్త్రమునకు కట్టుబడియుండువలయునను సత్యము, చెప్పబడినది.

21 వ శ్లోకం:

అశాస్త్రమాసురం కృత్స్నం శాస్త్రీయం గుణతః పృథక్ |

లక్షణం శాస్త్రసిద్ధస్య త్రిధా సప్తదశోదితమ్ ||

bhagavan

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

కృత్స్నం అశాస్త్రం : శాస్త్ర విహితములు కాని (/శాస్త్రముచే నిర్ణయింపబడని) అన్ని కర్మలు

ఆసురం : అవి అసురులకు (కౄర స్వభావం కలవారికి) చెందినవి (మరియు ఈ విధంగా పనికిరానివి)

శాస్త్రీయం : శాస్త్ర విహితములైన (/శాస్త్రముచే నిర్ణయింపబడిని) కర్మలు

గుణతః : (సత్వ, రజో మరియు తమో) గుణములకు  అనుగునంగా

పృథక్ : మూడు విధములుగా ఉండుటయు

శాస్త్ర సిద్ధస్య  : యాగము మొదలగు శాస్త్రములచే విహితములైన కర్మలు

త్రిధా లక్షణం : “ఓమ్ తత్ సత్” అను పదములు (వీటిని కలుపుట ద్వారా, ఇవి అట్టి కర్మలను మిగతావాటినుండి విభాగము చేయును) మరియు వాటిని కనుగొనుట

సప్తదశ ఉదితమ్ : పదిహేడవ అధ్యాయంలో  చెప్పబడినది.

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పదిహేడవ అధ్యాయంలో, శాస్త్ర విహితములుకాని అన్ని కర్మలు  అసురులకు (కౄర స్వభావం కలవారికి) చెందినవి (మరియు ఈ విధంగా పనికిరానివి), శాస్త్ర విహితములైన కర్మలు (సత్వ, రజో మరియు తమో గుణములని) మూడు విధములుగా ఉండుటయు. యాగము మొదలగు, శాస్త్రముచే విహితములైన కర్మలు “ఓమ్ తత్ సత్” అను మూడు లక్షణములు (వీటిని కలుపుట ద్వారా, అట్టి కర్మలను మిగతావాటినుండి విభాగము చేయును) కలవనియు మరియు వాటిని (అట్టి కర్మలను) తెలుసుకొనుటయు చెప్పబడినది.

22 వ శ్లోకం:

ఈశ్వరే కర్తృతాబుద్ధిస్సత్వోపాదేయతాంతిమే |

స్వకర్మపరిణామశ్చ శాస్త్రసారార్థ ఉచ్యతే ||

azhwar-thiruvadi-thozhalశ్రీ రంగనాథుని పాదపద్మముల చెంత నమ్మాళ్వార్ చే శరణాగతి యొక్క ప్రత్యక్ష ప్రదర్శనము

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఈశ్వరే కర్తృతా బుద్ధిః  : ఆ సమస్త కర్మలకు భగవానుడే కర్తగా చెప్పబడినది

సత్వ ఉపాదేయతా  : ఆ సత్వ గుణము (శాంత గుణము)  పొందదగినదిగా

స్వ కర్మ పరిణామఃఅట్టి శాంత కర్మలను (నియమాలతో) చేయుటవలన ఫలముగా స్వేచ్ఛ లభించును

శాస్త్ర సారార్థః చ  : భక్తి మరియు ప్రపత్తి ఈ  గీతా శాస్త్రము యొక్క సారాంశం

అంతిమే  : గీత చివరిలో, అనగా పద్దెనిమిదవ అధ్యాయంలో

ఉచ్యతే : చెప్పబడినది

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

గీతా శాస్త్రము చివరిలో, అనగా పద్దెనిమిదవ అధ్యాయంలో, సమస్త కర్మలకు భగవానుడే కర్తగా చెప్పబడినది. సత్వ (శాంత) గుణమే పొందదగినదిగా, అట్టి శాంత కర్మలను (నియమాలతో అనగా వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి) చేయుటవలన స్వేచ్ఛ (పరమపురుష ప్రాప్తి) లభించుటయు మరియు భక్తి ప్రపత్తులు ఈ  గీతా శాస్త్రము యొక్క సారాంశంగా చెప్పబడినది.

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్

మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-5/

పొందుపరిచిన స్థానము http://githa.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org