గీతార్థ సంగ్రహం – 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

గీతార్థ సంగ్రహం

భగవధ్గీత యొక్క ఉద్దేశ్యము

bhagavan

1 వ శ్లోకం

స్వధర్మ ఙ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచరః |

నారాయణ పరంబ్రహ్మ గీతా శాస్త్రే సమీరితః ||

 

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

  • స్వధర్మ ఙ్ఞాన వైరాగ్య సాధ్య భక్త్యేక గోచరః :ఎవరైతే కేవలం భక్తి చేతనే తెలుసుకొనబడుచున్నాడో, అట్టి భక్తి, ఇతరములైన ప్రాపంచిక విషయములను విడిచిపెట్టుటద్వారా, ఙ్ఞాన యోగం చేత (ఙ్ఞాన మార్గం ద్వారా), తన ప్రవృత్తికి సరిపడు (వర్ణాశ్రమధర్మాలను అనుసరించి) కర్మయోగం చేత  (సత్కర్మాచరన ద్వారా) లభించుచున్నది.
  • పరంబ్రహ్మ : సర్వశక్తిమంతుడైన / అత్యున్నతుడైన బ్రహ్మము
  • నారాయణ : శ్రీమన్నారాయణుడు
  • గీతా శాస్త్రే : గీతా శాస్త్రము నందు
  • సమీరితః : ప్రతిపాదించబడెను.

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

శ్రీమన్నారాయణుడు కేవలం భక్తి చేతనే తెలుసుకొనబడుచున్నాడు, అట్టి భక్తి, ఇతరములైన ప్రాపంచిక విషయములను విడిచిపెట్టుటద్వారా, ఙ్ఞాన యోగం చేత (ఙ్ఞాన మార్గం ద్వారా), తన ప్రవృత్తికి సరిపడు (వర్ణాశ్రమధర్మాలను అనుసరించి) కర్మయోగం చేత  (సత్కర్మాచరన ద్వారా) లభించుచున్నది. శ్రీమన్నారాయణుడే పరంబ్రహ్మ (సర్వోత్తముడైన / సర్వశక్తిమంతుడైన బ్రహ్మము) స్వరూపంగా గీతా శాస్త్రము నందు ప్రతిపాదించబడెను.

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్

మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-1/

archived in http://githa.koyil.org

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org