శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీమహాలక్ష్మి నాథుడైన, సర్వేశ్వరుడు, శ్రీమన్నారాయణుడు భూ భారాన్ని తీర్చడానికి శ్రీ కృష్ణుడిగా అవతరించారు. ఆ భూ భారాన్ని తగ్గించటానికి చేసిన లీలల్లో ప్రధానమైనది మహాభారాత యుద్ధం. ఆ పరమాత్మే ముందు నిలిచి యుద్ధాన్ని సిద్ధపరిచాడు, సైన్యాన్ని సమకూర్చి, అర్జునుడికి సారథిగా ఉండి, అవసరమైన సమయానికి సహాయం చేసి రక్షించాడు, యుద్ధంలో ఆయుధాలు చేత పట్టను అని సంకల్పించి కూడా ఆయుధాలు ధరించాడు, పగలు రాత్రిగా మార్చాడు, శత్రువుల ప్రాణం హరించే రహస్యం చూపించి, యుద్ధం ముగించాడు. ఈ యుద్ధం లో అర్జునుడ్ని ముందర పెట్టుకుని, ఆ అర్జునుడు యుద్ధం లో పాల్గొనను అన్నప్పుడు శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశాడు.
గీతర్థ సంగ్రహం ప్రారంభంలో, యమునాచార్యులవారు ఏంతో కారుణ్యం చేత అనుగ్రహిస్తూ, ఈ గీతా శాస్త్రం లో భగవంతుడు అయిన శ్రీమన్నారాయణుడ్ని కర్మ, జ్ఞాన, భక్తి యోగముల చేత పొందవచ్చు అని వివరించారు .
ఈ శాస్త్రం లో మొత్తం గా 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఉన్నాయి. ఆళవందార్లు మొదలైన ఆచార్య పురుషులు భగవద్గీతా మొత్తాన్ని 3 షట్కాలు గా విభజించారు (1 షట్కం – 6 అధ్యాయాలు).
ఆళవందార్లు, వారి గీతర్థ సంగ్రహంలో ప్రతీ షట్కాన్ని క్లుప్తం గా విషదపరిచారు. అవి :
- మొదటి షట్కం లో, యోగాన్ని పొందటం, దేహం ఆత్మ మధ్యలో ఉన్న వ్యత్యాసం అర్థం చేసుకోవటం ద్వారా మరియు కర్మ, జ్ఞాన యోగాల చేత ఆత్మానుభవాన్ని సాధించటం, స్థాపించారు
- రెండవ షట్కం లో, జ్ఞాన యోగం మరయు కర్మ యోగం తో కలిపిన భక్తియోగం , ఆ పరమ పురుషుణ్ణి పొందే మార్గం గా తెలియచేసారు.
- మూడవ షట్కం లో, గత రెండు షట్కాలల్లో వివరించని సూక్ష్మ మూలాధార ప్రకృతి మరియు జీవాత్మా, స్థూలమైన అచిత్ పదార్థం, వీటికి అతీతమైన సర్వేశ్వరుడు, కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు మరియు వాటిని సాధించే మార్గాలు, వివరించారు.
అడియెన్ ఆకాశ్ రామానుజ దాసన్
మూలము : https://githa.koyil.org/index.php/summary/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org