శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
యోత్స్యమానాన్ అవేక్షే’హం యా ఏతే’త్ర సమాగతాః
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః
ప్రతి పదార్థం
దుర్బుద్ధేః – దుష్టచిత్తము కలిగిన
ధార్తరాష్ట్రస్య – ధృతరాష్ట్రుని పుత్రుడైన దుర్యోధనునికి
యుద్ధే – యుద్ధమునందు
ప్రియచికీర్షవః – సంతోషము కలిగించుటకై
అత్ర – ఈ యుద్ధరంగమునందు
యే ఏతే – ఎవరైతే (భీష్మ, ద్రోణాదులు)
సమాగతాః – సమకూడిరో / చేరిరో
యోత్స్యమానాన్ – పోరాడగోరిన అట్టివారిని
అహమ్ అవేక్షే – నేను చూడగోరుచున్నాను
(ఇతి) అర్జున ఉవాచ – అని అర్జునుడు పలికెను
తాత్పర్యం
దుష్టచిత్తుడైన దుర్యోధనుడిని ప్రసన్నుడిని చేయడానికి, మనతో యుద్ధం చేయాలనే కోరికతో భీష్మ, ద్రోణ మరియు ఇతర యోధులు ఎవరైతే ఈ యుద్ధభూమిలో సమకూడారో… వారిని నన్ను చూడనివ్వు! (అని అర్జునుడు పలికెను).
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి.
మూలము : https://githa.koyil.org/index.php/1-23
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org