శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ||
ప్రతి పదార్థం
అథ: – ఇరుపక్షాల సైన్యాల భీకర గర్జనల తర్వాత
కపిధ్వజః – తన జెండాపై హనుమంతుల వారిని కలిగిన (అర్జునుడు)
శస్త్ర సంపాతే ప్రవృత్తే – యుద్ధం ప్రారంభమైనప్పుడు
వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా – ముందు వరుసలో వ్యూహాలు తీరి నిలబడి ఉన్న ధృతరాష్ట్రుని కుమారుల (కౌరవుల) వైపు చూసి
ధనుః – తన గాండీవ విల్లును
ఉద్యమ్య – పైకెత్తాడు.
తాత్పర్యం
ఇరుపక్షాల సైన్యాల భీకర గర్జనల తర్వాత, యుద్ధం ప్రారంభమైనప్పుడు, అర్జునుడు ముందు వరుసలో వ్యూహాలు తీరి నిలబడి ఉన్న ధృతరాష్ట్రుని కుమారుల వైపు చూసి తన గాండీవ విల్లును పైకెత్తాడు… (తర్వాతి శ్లోకంలో కొనసాగుతుంది).
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-20
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org