శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
అర్జున ఉవాచ
కథం భీష్మమహం సఙ్ఖ్యే ద్రోణం చ మధుసూదన ।
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ॥
ప్రతి పదార్థం
అర్జునః ఉవాచ – అర్జునుడు పలికెను
మధుసూదన – మధు అనే రాక్షసుడిని సంహరించిన ఓ కృష్ణా!
అరి-సూదన – శత్రుసంహారకుడా!
అహమ్ – నేను
సఙ్ఖ్యే – యుద్ధరంగమునందు
పూజా-అర్హౌ – పూజింపదగినవారైన (పూజార్హులైన)
భీష్మమ్ – భీష్మునితోనూ
ద్రోణం చ – మరియు ద్రోణాచార్యునితోనూ
ఇషుభిః – బాణములతో
కథమ్ – ఏ విధముగా
ప్రతి-యోత్స్యామి – ఎదురుదాడి చేసి యుద్ధము చేయగలను?
తాత్పర్యం
ఓ శత్రు సంహారకుడా! మధు అనే రాక్షసుడిని నాశనం చేసిన ఓ కృష్ణా! పరమ పూజనీయులైన భీష్మ పితామహుడు మరియు గురువైన ద్రోణాచార్యునికి వ్యతిరేకంగా ఈ యుద్ధరంగంలో నేను ఏ విధంగా పోరాడగలను?
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/2-4
పొందుపరచిన స్థానము – https://githa.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org