శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఙ్ఞాని యొక్క గొప్పతనం
29 వ శ్లోకం:
ఙ్ఞాని తు పరమైకాంతీ తదాయత్తాత్మ జీవనః |
తత్సం శ్లేషవియోగైక సుఖదుఃఖస్తదేగదీః ||
నమ్మాళ్వార్ - ఙ్ఞానులలో అగ్రగణ్యుడు
Listen
ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
పరమైకాంతీ ఙ్ఞాని తు : భగవంతుడి పట్ల (తదేకనిష్ఠ/) అంకితభావం కలవాడు ఙ్ఞాని
తదా యత్తాత్మ జీవనః : పూర్తిగా ఎమ్పెరుమాన్ మీద ఆధారపడి జీవించేవాడు
తత్ సంశ్లేష వియోగైక సుఖదుఃఖః : ఎమ్పెరుమాన్ తో కూడినపుడు (సాంగత్యలో) ఆనందమును, ఆతని ఎడబాయుటచే దుఃఖమును పొందును
తదేకదీః : ఆతని బుద్ధి కేవలం భగవానునిపై మాత్రమే సదా నిలచి (లేదా లగ్నమై) యుండును
సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
ఙ్ఞాని అనగా, భగవంతుడి పట్ల (తదేకనిష్ఠ/) అంకితభావం కలవాడు, పూర్తిగా ఎమ్పెరుమాన్ మీద ఆధారపడి జీవించేవాడు. ఆతడు ఎమ్పెరుమాన్ తో కూడినపుడు (సాంగత్యలో) ఆనందమును, ఆతని ఎడబాయుటచే దుఃఖమును పొందును. ఆతని బుద్ధి కేవలం భగవానునిపై మాత్రమే సదా లగ్నమై (నిరంతరము ధ్యానించుచూ) యుండును.
30 వ శ్లోకం:
భగవద్ధ్యాన యోగోక్తి వందనస్తుతికీర్తనైః |
లబ్ధాత్మా తద్గతప్రాణ మనోబుద్ధీంద్రియ క్రియః ||
నమ్మాళ్వార్ తిరువాయిమొళిలో ప్రకటించారు, 6.7.1 – ” ఉణ్ణుమ్ సోఱు పరుగు నీర్ తిన్నుమ్ వెఱ్ఱిలైయుమ్ ఎల్లామ్ కణ్ణన్” – ఆహారం, నీరు మరియు వక్కలు – జీవనోపాధి, పోషణ మరియు ఆనందం సమస్తమూ ఆ శ్రీ కృష్ణుడే
Listen
ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
భగవత్ ధ్యాన యోగ ఉక్తి వందన స్తుతి కీర్తనైః : భగవానుని ధ్యానించుట, (దివ్యదేశములయందు) దర్శించుట, ఆతని (మహిమ) గురించి మాట్లాడుట, నమస్కరించుట, ఆతని స్తుతించుట, ఆతని (దివ్యవైభవమును) కీర్తించుట మున్నగు వానిచేత
లబ్దాత్మా : తన స్వరూపమును పొందుచున్నాడు
తత్ గత ప్రాణ మనో బుద్ధి ఇంద్రియ క్రియః : అట్టివాని జీవితము (/ప్రాణము), మనస్సు, బుద్ధి, ఇంద్రియముల యొక్క క్రియలు, భగవానుని యందు మాత్రమే నిమగ్నమై వుండును.
సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
భగవానుని ధ్యానించుట, (దివ్యదేశములయందు) దర్శించుట, ఆతని (మహిమ) గురించి మాట్లాడుట, నమస్కరించుట, స్తుతించుట, (దివ్యవైభవమును) కీర్తించుట మున్నగు వానిచేత, తన స్వరూపమును పొందుచున్నాడో, అట్టివాని జీవితము (/ప్రాణము), మనస్సు, బుద్ధి, ఇంద్రియముల యొక్క క్రియలు, భగవానుని యందు మాత్రమే నిమగ్నమై వుండును.
31 వ శ్లోకం:
నిజ కర్మాది భక్త్యంతం కుర్యాత్ ప్రీత్యేవ కారితః |
ఉపాయతాం పరిత్యజ్య న్యస్యేద్దేవే తు తామభీః ||
ఎమ్పెరుమానార్ - ఙ్ఞానులలో అగ్రగణ్యుడు
Listen
ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
నిజ కర్మాది : కర్మ యోగమును తమ వర్ణాశ్రమ ధర్మములకు అనుగునంగా ప్రారంభించి
భక్తి అంతం : భక్తి యోగ పర్యంతము
ఉపాయతాం పరిత్యజ్య : (భగవానుని పొందుటకు) ఉపాయత్వ బుద్ధిని విడిచిపెట్టి
ప్రీత్యా ఏవ కారితః : (సహజముగా అందరికీ ప్రభువైన భగవానునికి సరిపడునట్టి) భక్తితో ఉద్దీపన చేయబడిన
కుర్యాత్ : (పరమైకాన్తి అయిన ఙ్ఞాని – భగవానుని యందు పూర్తిగా నిమగ్నమైనవాడు) ఆచరించును
అభీః : నిర్భయముగా
తామ్ : ఆ ఉపాయత్వము
దేవే తు : భగవానుని యందు మాత్రమే
న్యస్యేత్ : ధ్యానము చేయవలెను
సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).
పరమైకాన్తి అయిన (భగవానుని యందు పూర్తిగా నిమగ్నమైనవాడు) ఙ్ఞాని, (సహజముగా అందరికీ ప్రభువైన భగవానునికి సరిపడునట్టి) భక్తితో ఉద్దీపన పొంది, కర్మ యోగమును తమ వర్ణాశ్రమ ధర్మములకు అనుగునంగా ప్రారంభించి భక్తి యోగ పర్యంతము అచరించును, (భగవానుని పొందుటకు) ఆ యోగములయొక్క ఉపాయత్వ బుద్ధిని నిర్భయముగా విడిచిపెట్టి, ఆ ఉపాయత్వము భగవానుని యందు మాత్రమే వుంచి ధ్యానము చేయవలెను.
అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్
మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-7/
పొందుపరిచిన స్థానము http://githa.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org