గీతార్థ సంగ్రహం – 8

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

గీతార్థ సంగ్రహం

<< గీతార్థ సంగ్రహం – 7

ముగింపు

32 వ శ్లోకం:

ఏకాంతాత్యంత దాస్యైకరతిస్తత్పదమాప్నుయాత్ |

తత్ప్రధానమిదం శాస్త్రమితి గీతార్థసంగ్రహః ||

paramapadhanathanపరమపదము - ఉత్కృష్ట గమ్యమైన నారాయణుని దివ్య నివాసస్థానము

Listen

ప్రతిపదార్థ తాత్పర్యం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

ఏకాంత అత్యంత దాస్యైకరతిః : పరమైకాన్తి అనగా, ఎమ్పెరుమాన్ ప్రీతికొరకు ప్రత్యేకంగా దృష్టిపెట్టి, ఆ భగవానుని సేవకొరకు మాత్రమే కర్మలను ఆచరించువాడు

తత్ పదంఎమ్పెరుమాన్ పాద పద్మములను (సేవచేయుటకై)

ఆప్నుయాత్  :  చేరుకొనును

ఇదం శాస్త్రంఈ గీతా శాస్త్రం

తత్ ప్రధానమ్ :  జీవాత్మను పరమైకాన్తిగా మార్చుటయే ప్రధాన లక్ష్యముగా కలిగియున్నది

ఇతి  :  ఈ విధముగా

గీతార్థ సంగ్రహః : భగవద్గీత యొక్క అర్థమును క్లుప్తంగా వివరిస్తున్న ఈ “గీతార్థ సంగ్రహము” పూర్తి అయినది

సరళమైన అనువాదం: (పుత్తూరు కృష్ణమాచార్య స్వామి తమిళ అనువాదం ఆధారంగా గ్రహించబడినది).

పరమైకాన్తి, ఎమ్పెరుమాన్ ప్రీతికొరకు ప్రత్యేకంగా దృష్టిపెట్టి, ఆ భగవానుని సేవకొరకు మాత్రమే కర్మలను ఆచరించువాడు, ఎమ్పెరుమాన్ పాద పద్మములను (సేవచేయుటకై) చేరుకొనును. ఈ గీతా శాస్త్రం జీవాత్మను పరమైకాన్తిగా మార్చుటయే ప్రధాన లక్ష్యముగా కలిగియున్నది.ఈ విధముగా భగవద్గీత యొక్క అర్థమును క్లుప్తంగా వివరిస్తున్న ఈ “గీతార్థ సంగ్రహము” పూర్తి అయినది.

ఆళవన్దార్ చే రచింపబడిన గీతార్థ సంగ్రహము యొక్క ఆంధ్రానువాదము సమాప్తము.

ఆళ్వార్ తిరువడిగళే శరణమ్
ఆళవన్దార్ తిరువడిగళే శరణమ్
ఎమ్పెరుమానార్ తిరువడిగళే శరణమ్
జీయర్ తిరువడిగళే శరణమ్

అడియేన్ వకుళాభరన రామానుజ దాసన్

మూలము : http://githa.koyil.org/index.php/githartha-sangraham-8/

పొందుపరిచిన స్థానము http://githa.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org