1.43 – దోషైరేతైః కులఘ్నానాం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.42

శ్లోకం 

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసఙ్కరకారకైః ।

ఉత్సాద్యన్తే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥

ప్రతి పదార్థం 

వర్ణ-సఙ్కర-కారకైః – వర్ణసాంకర్యమును కలుగజేసే

కుల-ఘ్నానామ్ – కులహంతకుల యొక్క

ఏతైః దోషైః – ఈ దోషముల వలన (పాపముల వలన)

శాశ్వతాః – సనాతనమైన (శాశ్వతమైన)

జాతి-ధర్మాః – వర్ణాల సాంప్రదాయక నియమాలు మరియు ధర్మాలు [ బ్రాహ్మణ వర్ణము వలె ]

కుల-ధర్మాః చ – మరియు కులధర్మములు

ఉత్సాద్యన్తే – నశించిపోవును (కూలిపోవును)

తాత్పర్యం 

వంశాన్ని నాశనం చేసేవారు మరియు వర్ణసాంకర్యాన్ని కలిగించేవారి ఈ దోషాల వల్ల, వర్ణాల యొక్క మరియు కులాల యొక్క శాశ్వతమైన, సాంప్రదాయిక నియమాలు మరియు ధర్మాలు [బ్రాహ్మణ వర్ణం వంటివి] సమూలంగా నశించిపోతాయి/కూలిపోతాయి.

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి

>> అధ్యాయం 1 శ్లోకం 1.44

archived in https://githa.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment