అధ్యాయం 1 – అర్జున విషాద యోగం

 శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః


ఆళ్వార్ తిరునగరి, శ్రీపెరంబూదూర్, శ్రీరంగం మరియు  తిరుణారాయణపురంలో భగవత్ రామానుజులు

గీతా భాష్యం కోసం ఆళవందార్ల మీద రామానుజుల వారు రచించిన తనియన్ 

యత్ పదామ్బోరుహధ్యాన విద్వస్థాశేష కల్మషః |
వస్తుతాముపయా తోహం యామునేయం నమామితమ్

యామునాచార్యుల దివ్య తిరువడులను (పాదపద్మాలను) ధ్యానించిన ఫలంగా నా అంతరంగంలోని అన్ని కల్మషాలు (లోపాలు, అజ్ఞానం) తొలగిపోయాయి. వారి దయతో నేను అసత్ (అనిత్యమైన) స్థితి నుండి సత్ (ఆత్మస్వరూపమైన, శాశ్వతమైన) స్థితికి చేరుకున్నాను. ఆ మహానుభావుడైన యామునాచార్యునికి నా నమస్కారాలు.  ధన్యవచనులైన శ్రీ రామానుజాచార్యుల వారికి ప్రణామం

శ్రీ రామానుజుల తనియన్

యోనిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ
వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||

ఇతరములను గడ్డిపరక(విలువలేని)గా భావిస్తు నిరంతరము అచ్యుతుని దివ్య/బంగారు పాదయుగ్మముల యందు వ్యామోహపడి,   దివ్య లక్షణములను కలిగిన కరుణా సముద్రులు మా ఆచార్యులైన శ్రీరామానుజుల దివ్య చరణారవిందములను రక్షకములుగా  ఆశ్రయుస్తున్నాను.

ఆముక్త రామానుజ దాసి

మూలము : https://githa.koyil.org/index.php/1/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org