1.47 – ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.46

శ్లోకం 

సంజయ ఉవాచ

ఏవముక్త్వార్జునః సఙ్ఖ్యే రథోపస్థ ఉపావిశత్ ।

విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః ॥

ప్రతి పదార్థం 

సంజయః ఉవాచ – సంజయుడు పలికెను

సఙ్ఖ్యే – యుద్ధరంగమునందు

ఏవమ్ ఉక్త్వా – ఈ విధముగా పలికి

శోక-సంవిగ్న-మానసః – శోకముచేత కలతచెందిన మనస్సు గలవాడై

స-శరమ్ చాపమ్ – బాణములతో కూడిన ధనుస్సును

విసృజ్య – క్రింద పారవేసి (విడిచిపెట్టి)

అర్జునః – అర్జునుడు

రథ-ఉపస్థే – రథము యొక్క వెనుక భాగమునందు

ఉపావిశత్ – కూర్చుండెను

తాత్పర్యం 

ఈ విధంగా అర్జునుడు పలికి శోకంతో నిండిన మనస్సుతో, తన ధనుర్బాణాలను క్రింద పడవేసి, యుద్ధరంగంలో తన రథంపై చతికిలబడ్డాడు. ఈ విధంగా సంజయుడు ధృతరాష్ట్రుడితో పలికెను.

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి

>> అధ్యాయం 2.1

మూలము : https://githa.koyil.org/index.php/1-47

పొందుపరచిన స్థానము – https://githa.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment