శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకం
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ॥
ప్రతి పదార్థం
ద్విజోత్తమ – ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా ! ద్విజులలో ఉత్తముడైన గురువర్యా !
అస్మాకం తు – మన పక్షమునందు / మన మధ్యన
విశిష్టాః నాయకాః యే – ఇక్కడ ఉన్న ఆ ప్రసిద్ధ సేనాధిపతులు ఎవరైతే ఉన్నారో
తాన్ – వారిని గురించి
తే – మీ కొరకు / మీ అవగాహన కోసం
సంజ్ఞార్థం – స్పష్టముగా గ్రహించుటకు / గుర్తు చేయుట కొరకు
బ్రవీమి – నేను తెలియజేస్తున్నాను / పలుకుతున్నాను
తాన్ – వారి పేర్లను
నిబోధ – ఆలకించండి / చిత్తగించండి
తాత్పర్యం
ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా! మీ అవగాహన కొరకు, మన మధ్య ఉన్న ఆ మహోన్నత సేనాధిపతుల గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. దయచేసి వారిని గురించి ఆలకించండి
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలం: https://githa.koyil.org
పొందుపరచిన స్థానము- https://githa.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org