1.8 భవాన్ భీష్మశ్చ

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

అధ్యాయం 1

<< అధ్యాయం – 1 శ్లోకం – 7

శ్లోకం 

భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।

అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ||

ప్రతి పదార్థం

భవాన్  – తాము (గురుదేవులైన ద్రోణాచార్యులు)

భీష్మః చ (భీష్మశ్చ) – మరియు పితామహ భీష్ముడు

కర్ణః చ (కర్ణశ్చ) – మరియు అంగరాజు అయిన కర్ణుడు

సమితింజయః కృపః చ (సమితింజయః కృపశ్చ) – యుద్ధరంగమున సదా విజయాన్ని వరించే కృపాచార్యుల వారు

అశ్వత్థామా – మీ కుమారుడైన అశ్వత్థామ

వికర్ణః చ (వికర్ణశ్చ) – మరియు తమ్ముడైన వికర్ణుడు

సౌమదత్తిః (సౌమదత్తి) – సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు

తాత్పర్యం:

గురుదేవులైన తాము (ద్రోణాచార్యులు), పితామహ భీష్ముడు, కర్ణుడు, యుద్ధరంగంలో సదా విజయాన్ని వరించే కృపాచార్యుల వారు, మీ కుమారుడైన అశ్వత్థామ, నా సోదరుడైన వికర్ణుడు మరియు సోమదత్త పుత్రుడైన భూరిశ్రవుడు –  వీరందరూ ఇక్కడ (మన పక్షాన) కొలువై ఉన్నారు.

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

>> అధ్యాయం – 1 శ్లోకం – 9

మూలము : https://githa.koyil.org/index.php/1/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org