శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
కార్పణ్య దోషోపహతస్వభావః పృచ్ఛామి త్వా ధర్మసమ్మూఢచేతాః ।
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధిమాం త్వాం ప్రపన్నమ్ ॥
ప్రతి పదార్థం
కార్పణ్య దోషోపహతస్వభావః – మానసిక బలహీనత (దీనత్వం) వల్ల నశించిన సహజ ధైర్యము/స్వభావము కలవాడనై
ధర్మసమ్మూఢచేతాః – ధర్మం ఏది, అధర్మం ఏది అనే విషయంలో తీవ్రమైన భ్రమకు గురైన చిత్తము గలవాడనై
త్వా – నిన్ను
పృచ్ఛామి – అడుగుచున్నాను
యత్ నిశ్చితం శ్రేయః స్యాత్ – ఏది (నాకు) నిశ్చయమైన శ్రేయస్కరమో
తత్ – దానిని
మే – నాకు
బ్రూహి – దయచేసి చెప్పుము / ఉపదేశించుము
అహమ్ – నేను
తే శిష్యః – నీ శిష్యుడను అయ్యాను
త్వామ్ ప్రపన్నమ్ – నిన్ను శరణు వేడినటువంటి
మామ్ – నన్ను
శాధి – శాసించుము / సరైన మార్గాన్ని ఉపదేశించి దారిచూపుము.
తాత్పర్యం
మానసిక బలహీనత కారణంగా కోల్పోయిన ధైర్యంతో, ధర్మాధర్మాల విచక్షణ మసకబారిన మనస్సుతో నేను నిన్ను అడుగుతున్నాను. నేను నీ శిష్యుడినయ్యాను.నా కొరకు ఏది నిశ్చయమైన శ్రేయస్కరమో దానిని దయచేసి ఉపదేశించు. నీ పాదాలను శరణువేడిన నన్ను రక్షించి, సరైన మార్గంలో నడిపించు.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/2-7
పొందుపరచిన స్థానము – https://githa.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org