శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
గీతార్థ సంగ్రహం లోని 6 వ శ్లోకం లో, ఆలవందార్లు రెండవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “ఆత్మ యొక్క శాశ్వతత్వం, నిష్కామం గా చెయ్యాల్సిన ధర్మమైన కర్మ, స్థితప్రజ్ఞ లో ఉండటం(నిర్ణయాలు మరియు జ్ఞానం లో స్థిరం గా ఉండటం) గమ్యం గా , తన గురించి మరియు కర్మ యోగం గురించిన జ్ఞానం ఉపదేశించి అర్జునుడి కలతని తీర్చాడు రెండవ అధ్యాయం లో.
ముఖ్యమైన శ్లోకాలు :
మొదటి కొన్ని శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడిని బయస్థుడి లా ఉన్నట్టు గా నిందిస్తూ, తన బలహీనత ని వదలమని ఆదేశిస్తున్నాడు. అయినప్పటికీ అర్జునుడు తన వాదనని తిరిగి చెప్తూ తన బంధువులు/గురువులని ని సంహరించటం తనకి సమ్మతం కాదని చెప్పాడు.
శ్లోకం 7 :
కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వా ధర్మసమ్మూడాచేతాః । యచ్రేయః స్యాన్ నిచ్చితం బృహి తన్మే శిష్యస్తేహం శాదీమాం త్వాం ప్రపన్నం ॥
నాకు మానసిక బలం లేక నా శక్తి క్షీణించింది మరియు నా మనస్సు లో గుణాల విషయమై మనస్సు లో సందేహం కలిగింది, నేను నీ సమాధానం కోసం వేచి ఉన్నాను. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి నాకు ఏది మంచో ఉపదేశించు. నీకు శరణాగతి చేసిన నన్ను ఉద్ధరించు.
వివరణము : ఇక్కడ అర్జునుడు , శ్రీ కృష్ణుడిని గురువు గా స్వీకరించి, శరణాగతి చేసి, తనకు మార్గనిర్దేశం చెయ్యమని ప్రార్థించాడు. ఆ తరువాత కొన్ని శ్లోకాల లో, తన సంపూర్ణ శరణాగతి గురించి వివరించబడింది. కృష్ణుడు 11 వ శ్లోకం మొదలు గీతోపదేశం కొనసాగించాడు.
శ్లోకం 11
శ్రీ భగవాన్ ఉవాచ : అశోచ్యన్ అన్వశోచస్త్వం ప్రగ్యా వాదాంశ్చ భాషాసే । గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ॥
కృష్ణుడు మాట్లాడుతూ – అర్జున, నువ్వు చింతిస్తానికి అర్హత లేని వారి కోసం చింతిస్తున్నావు; నువ్వు మాట్లాడుతుంది నీ జ్ఞానం చేత, కాని విజ్ఞులు (తెలివైన వ్యక్తులు) ప్రాణంలేని శరీరాల పై కాని ప్రాణం ఉన్న ఆత్మల పై కాని చింతించరు.
వివరణము : మొదట, మనం ముఖ్యము గా తెలుసుకోవాల్సింది, ఏది అనుసరించాలి మరియు ఏది విడిచిపెట్టాలో అర్థం చేసుకోవటం.
శ్లోకం 12 :
న త్వేవాహం జాతు నాశం న త్వం నేమే జనాధిపాః । న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం ॥
గతం లో నేను (సర్వేశ్వరుడు – మీ అందరి ప్రభువు), నువ్వు (జీవాత్మలు – ఆత్మ, చేతనులు) మరియు ఈ రాజులు (జీవాత్మలు – ఆత్మ,చేతనులు) లేని సమయం లేదు. మరయు భవిష్యత్ కాలం లో కూడా మనం అందరం (నేను, నువ్వు, ఈ రాజులు) లేని సమయం లేదు.
వివరణం : కృష్ణుడు ఇక్కడ ఆత్మ యొక్క శాశ్వతం తత్వాన్ని స్థాపిస్తూ, తనకి, అర్జునుడికి మధ్యలో వ్యత్యాసం అనగా గురు శిష్యులు గా నిర్ధారిస్తున్నారు.
శ్లోకం 13
దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా । తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ॥
ఎలాగైతే ఆత్మ (శరీరం కలిగినది) ఈ శరీరం ద్వార బాల్యం, యౌవనం, వృద్ధాప్యం కి గురి అవుతుందో, అలాగే ఈ ఆత్మ కొత్త శరీరం పొందుతుంది( ఈ శరీరం త్యజించాక) ఈ ఆత్మ యొక్క పునర్జన్మానం చూసి చలించకుండా ఉండే వారే వివేకం కల వారు.
వివరణం : ఈ శ్లోకం మొదలు కొన్ని శ్లోకాల లో, కృష్ణుడు ఆత్మ తత్వాలు విస్తారం గా వివరిస్తున్నారు ఉదా-ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం, ఇంద్రియ నిగ్రహం మొదలైనవి.
శ్లోకం 17
అవినాశి తు తద్విద్ధి యేన సర్వం ఇదం తథం । వినాశం అవ్యయస్యాస్య నా కశ్చిత్ కర్తుం అర్హతి ॥
ఆత్మ అన్ని అచేతన వస్తువులు లో వ్యాపించి ఉంది అని తెలుసుకో, అలాగే ఆత్మ వినాశం లేనిది, ఇటువంటి అనశ్యం అయిన ఆత్మని నాశనం చెయ్యటం ఏ వస్తువు వల్ల కాదు.
శ్లోకం 20
నా జయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వ భవితా వా నా భూయః । అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ॥.
ఆత్మ ఎన్నడూ సృజించబడినది లేదా నశ్యం అయ్యేది కాదు; ఈ ఆత్మ సృజించబడినది కాదు (కల్పం యొక్క మొదట్లో – బ్రహ్మా యొక్క రోజు) మరయు మళ్లీ (కల్పం యొక్క చివర్లో) నశింపబడదు; అది జనించినది కాదు, శాశ్వతం, పరివర్తనం లేనిది, పురాతనం అయినది మరయు నిత్య నూతనం అయినది అలాగే శరీరం నశించినప్పుడు ఈ ఆత్మ నశించదు.
శ్లోకం 22
వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి । తథా శరీరాణి విహాయ జీర్ణాణి అన్యాని సంయాతి నవాని దేహీ ॥
ఎలాగైతే మనుష్యుడు జీర్ణమైన వస్త్రాలు త్యజించి కొత్త వస్త్రాలు స్వీకరిస్తాడో, ఆత్మ (శరీరం లో నివాసమున్న) జీర్ణమైన శరీరాన్ని త్యజించి నూతనమైన శరీరాన్ని స్వీకరిస్తుంది.
శ్లోకములు 26 మరయు 27, కృష్ణుడు ఉపదేశిస్తూ “ఒకవేళ ఈ ఆత్మ సృజించబడినది అలాగే నాశనం అయ్యేది అని భావించినప్పటికీ, నువ్వు చింతించకూడదు ఎందుకు అంటే సృజించబడిన ప్రతి వస్తువు ఏదో ఒక్క రోజు నష్టమవుతుంది కద”.
శ్లోకం 31 లో కృష్ణుడు “నీ క్షత్రియ ధర్మం ప్రకారం కూడా, నీవు ఈ యుద్ధం లో పాల్గొనాల్సిందే మరియు వెనక్కి తగ్గటం వీలుపడదు”. ఇలా చెప్తూ అర్జునుడ్ని యుద్ధం చెయ్యటానికి కారణాలు చెప్తూ ప్రోత్సహిస్తున్నాడు.
శ్లోకం 38
సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ । తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపం అవాప్స్యసి ॥
సుఖ దుఃఖాలని సమానము గా భావించు, అనుకున్న లాభాన్ని నష్టాన్ని (సంతోషం బాధలకి కారణాలు) మరియు జయ అపజయాన్ని ( లాభ నష్టాలకు కారణం) సమానంగా భావించాలి; అటు పిమ్మట, ఒక వేళ నువ్వు యుద్ధం లో పాల్గొన్న (ఈ ఆలోచనల తో), నీవు దుఃఖపూరితమైన సంసారాన్ని (లౌకిక ప్రపంచాన్ని) పొందవు).
39వ శ్లోకం మొదలు, కృష్ణుడు అర్జునుడికి కర్మ యోగం వివరిస్తున్నాడు.
శ్లోకం 40
నేహాభిక్రమ నాశోఽస్తి ప్రత్యవాయో న విధ్యతే । స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ ॥
ఈ కర్మయోగంలో, ఆరంభించిన కర్మల వల్ల నష్టం వాటిల్లదు (ఆరంభించిన వెంటనే ఆగిపోయినవాటికి కూడా) ఎటువంటి దోషం లేదు; ఈ కర్మ యోగం అనే ధర్మం లో, ప్రతీ చిన్న ప్రయత్నం చెయ్యటం చేత సంసారం(లౌకిక ప్రపంచం/బంధము) వల్ల కలిగే క్రూరమైన భయం తొలుగుతుంది
శ్లోకం 45
త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున । నిర్ధ్వంధ్వో నిత్యసత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ ॥
ఓ అర్జున ! వేదములు మూడు గుణాలు (సత్వ, రజో, తమో) కల్గిన వారి యోగక్షేమం పై దృష్టీకరిస్తుంది. కానీ నువ్వు ఈ మూడు గుణాలకు అతీతుడవు కావలెను. మరియు నువ్వు ద్వంద్వాలకు(సంతోషం/బాధలు వంటివి) అతీతుడవు కావాలి, రోజూ విస్తరించే మంచి తో కూడి ఉండాలి, వస్తువులను పొందాలి అనే కోరిక చేత భాధింపబడక (యోగం); పొందిన వాటిని రక్షించుకోవాలి అనే ఆర్తి లేకుండ (క్షేమం), నీ నిజస్వరూపాన్ని అన్వేషించే కార్యం లో పూర్తి ఏకాగ్రత తో కృషించే సాధకుడి గా మారు.
వివరణం : ఇక్కడ క్షుద్ర కోరికలు కలిగిన వ్యక్తులు వేదం లో చెప్పబడిన ఫలితాలపై దృష్టిసారిస్తారు అని వివరిస్తూ, కృష్ణుడు వాటిని ఎందుకు వేదాలు చూపుతున్నాయి అనే విషయాన్ని వివరిస్తున్నాడు ఈ శ్లోకం లో. మరియు తరువాత శ్లోకం లో, వివేకులు ఉత్తమ ఫలితాలు ఎలా ఆశిస్తారో చెప్పబడింది.
శ్లోకం 46
యావాన్ అర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే । తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥
ఏ ఒక్కరైతే కొంచం జలాన్ని ఉపయోగించాలి అనుకుంటారో, జలం తో నిండి ఉన్న సరోవరం నుండి కొంత మాత్రమే స్వీకరిస్తారు. అదే విధంగా, ఒక్క వివేకవంతుడు అయిన ముముక్షువు (మోక్షము కోరేవారు) , వైదికుడు(వేదాలు పాటించే వారు) అయినప్పటికీ వేదాలు మొత్తంలో , అవసరం అయిన విషయాన్ని (మోక్షం కి కావాల్సిన భాగం) స్వీకరించాలి [ముముక్షువులు వేదంలో ఉన్న అన్ని విషయాల్ని స్వీకరించి అనుసరించాల్సిన అవసరం లేదు].
శ్లోకం 47
కర్మణి ఏవాధికారస్తే మా ఫలేషు కధాచన । మా కర్మఫలహేతుర్భూర్మాది సంగోఽస్త్వకర్మణి ॥
ముముక్షువు గా ఉండుటకు, నువ్వు నిజమైన నిత్య(రోజు చేసేవి) నైమిత్తిక కర్మలు మాత్రమే కోరుకోవాలి; స్వర్గం వంటి క్షుద్ర ఫలితాలు (ఈ కర్మలు వాళ్ల కలిగే ఫలితాలు) కోరుకోకూడదు; మోక్షం కలగ చేసే ఇటువంటి కర్మల పట్ల మందముగా వ్యవహరించకూడదు.
రాబోవు అనేక శ్లోకాలలో, శ్రీ కృష్ణుడు వివేకవంతులు చేపట్టే నిష్కామ కర్మలు గురించి వివరిస్తున్నారు.
శ్లోకం 53
శృతివిప్రతిపన్నా తే యధా స్థాస్యతి నిశ్చలా । సమాధావచలా బుద్ధి స్తధా యోగం అవాప్సయసి ॥
నా నుండి విన్న జ్ఞానం వల్ల తెలుసుకుని, ఎప్పడు అయితే నీ అచంచలమైన వివేకం దృఢమవుతుందో, అప్పుడు ఆ సమయం లో నీకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
వివరణం : అప్పుడు, అర్జునుడు స్థితప్రాగ్యుడు (జ్ఞాన యోగ లో నిల్చిన వాడి) గురించి ప్రశ్నించినప్పుడు, శ్లోకం 55 నుండి, కృష్ణుడు స్థితప్రగ్యుడి విషయం వివరిస్తున్నాడు.
శ్లోకం 55
శ్రీభగవాన్ ఉవాచ – ప్రజహాతి యధా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ । ఆత్మని ఏవాత్మనా తుష్టః స్థితప్రగ్యాస్తధోచ్యతే ॥
ఓ పృథు కుమార! ఎప్పడు అయితే తమ ఆత్మ(ఆనందపూరిత) పట్ల ప్రేమ కలిగిన మనస్సు(ఆత్మ పై దృష్టిసారించిన) తో ఉండి, తన సమస్త(ఇతరమైన) కోరికలు వదిలి వేస్తారో, అప్పుడు అతను స్థితప్రగ్యుడు గా గుర్తింపు పొందుతారు.
వివరణం : ఈ 55 వ శ్లోకంలో, అత్యంత చివరి స్థితి అయిన వశీకార సంగ్యై వివరించారు. 56వ శ్లోకం లో ఏకేంద్రియ సంగ్యై, 57 శ్లోకంలో దాని తర్వాత నీచమైన స్థితియైనా వ్యతిరేక సంగ్యై, 58వ శ్లోకంలో అత్యంత చివరి స్థితి అయినా యథామాన సంగ్యై వివరించబడింది. ఈ స్థితులు అన్ని , మనస్సుని ఆత్మ వైపు క్రమ-క్రమంగా తీసుకువెళ్లటం చెప్పబడింది మరియు చైయక పోవటం వల్ల కలిగే ఫలితాలు చెప్ప బడ్డాయి. చివరిగా 68 శ్లోకంలో, కృష్ణుడు విషయ వాసనల నుండి ఇంద్రియాలు ఎవరైతే నిగ్రహిస్తాడో అతను తన జ్ఞానం ను ఆత్మ పైన కేంద్రికరిస్తాడు, అని ముగించారు.
ఈ అధ్యాయం చివరి శ్లోకాల్లో, ఆత్మసాక్షాత్కర వైభవం మరయు ఆత్మస్వరూపం పొందుట గురించి స్పష్టం చేశారు.
అడియెన్ ఆకాష్ రామానుజ దాసన్
మూలము : https://githa.koyil.org/index.php/essence-2/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org