శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 5 (కర్మ సన్యాస యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 4

గీతార్థ సంగ్రహం లోని 9వ శ్లోకం లో, ఆళవందార్లు అయిదవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “అయిదవ అధ్యాయం కర్మ యోగం యొక్క సాధ్యత చెప్పబడింది,కర్మ యోగం యొక్క శీఘ్ర కార్య సాధన దృష్టికోణం, దాని సహాయక భాగాలు మరియు అన్ని శుద్ధమైన ఆత్మలను సమదృష్టితో చూసే స్థితి చెప్పబడింది.”

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

అర్జున ఉవాచ. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్ యోగం చ శంససి । యచ్చే యేతయోర్ ఏకం తన్మే బ్రూహి సునిశ్చితం ॥

అర్జునుడు చెప్తూ ; ఓ కృష్ణ! నువ్వు ఒకసారి “కర్మయోగం విడిచి జ్ఞానయోగం” చెయ్యటాని పొగుడుతున్నావు మరియు తిరిగి కర్మ యోగం గురించి చెప్తూ ఇది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటానికి సాధనం గా చెప్తున్నావు. నువ్వు రెండిట్లో ఏది ఉత్తమం అనుకుంటున్నావో నాకు వివరించు.

వివరణం : శ్రీ కృష్ణుడు వేరే సాధనలను వేరు వేరు సందర్భాల్లో కీర్తిస్తున్నారు. అర్జునుడికి సందేహం కలిగింది, స్పష్టమైన సమాధానం చెప్పమని ప్రశ్నిస్తున్నాడు.

శ్లోకం 2

శ్రీ భగవాన్ ఉవాచ. సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ । తయోస్ తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ॥

జ్ఞాన యోగం అలాగే కర్మ యోగం రెండూ కూడా వేరుగా ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. కానీ, రెండిట్లో జ్ఞానయోగం(కొన్ని కారణాలు చేత) కన్నా కర్మ యోగానికి మాత్రమే అధిక ప్రాధాన్యత ఉంది.

వివరణం : కర్మ యోగం యొక్క గొప్పతనం ఇక్కడ చెప్పబడింది.

శ్లోకం 3

జ్ఞేయః స నిత్యసన్యాసి యో న ద్వేష్టి నా కాంక్షతి । నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రాముచ్యతే ॥

ఓ మహా బాహు! ఎవరు అయితే కర్మయోగాన్ని ఎటువంటి కోరిక (ఇంద్రియ కాంక్షలు) లేకుండా పాటిస్తారో మరియు ఎవరి పట్ల ద్వేషం లేకుండా ఉంటారో (వారి సుఖాలకు భంగం కలిపించే వారి పట్ల) మరియు ద్వందాలను సహిస్తారో (సుఖ-దుఖాలు, వేడి-చలి), జ్ఞానం పైన నిలిచి ఉంటారో. తాను మాత్రమే సులభంగా సంసారం నుండి విముక్తుడు అవుతారు.

వివరణం : కర్మ యోగం ఎలా పాటించాలో చెప్పబడింది.

రాబోవు శ్లోకాల్లో, జ్ఞాన యోగం కర్మ యోగం రెండు ఒకే ఫలం ప్రసాదిస్తాయి మరియు జ్ఞానులు వాటిని సమానం గా చూస్తారు.

6వ శ్లోకం లో, కర్మ యోగం యొక్క ప్రాముఖ్యత మరియు సరళత చెప్పబడింది. తర్వాత శ్లోకం లో, వీటి కారణం వివరిస్తున్నారు. దీని తర్వాత రెండు శ్లోకాల్లో, 8వ 9వ శ్లోకాల్లో, కర్మ యోగం లో కర్తవ్య సమర్పణం యొక్క ప్రాముఖ్యత చెప్పబడింది.

తర్వాత, తను నిష్కామం(ఫలాపేక్ష లేకుండ) గా చెయ్యవలసిన కర్మ యోగం లోని లోతైన తత్వాలు చెప్పబడ్డాయి.

శ్లోకం 18

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని । శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ॥

జ్ఞానులు, ఒకే రూపాన్ని/స్వభావాన్ని కలిగిన ఆత్మలను సమముగా చూస్తారు. జ్ఞానం మరియు వినయం కలిగిన బ్రాహ్మణుడిని, అవి లేని బ్రాహ్మణుడిని. (రూపంలో చిన్నది) ఆవుని, (రూపంలోపెద్దది) ఏనుగుని, (చంపి తినేది) కుక్కని, (ఆ కుక్కలని చంపి తినే) చండాలుడును.

వివరణం : ఇక్కడ, ఆత్మ సాక్షాత్కారం రమ్యముగా వివరించబడింది.

తర్వాత, ఆత్మ పైన శ్రద్ధ కలిగిన వారి స్వభావం వివరించబడింది.

శ్లోకం 29

భోక్తారం యజ్ఞాతపసాం సర్వలోకమహేశ్వరం । సహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మామ్ శాంతిం రుచ్ఛతి ॥

ఎవరు అయితే నన్ను, యజ్ఞాలు మరియు తపస్సును స్వీకరించే వాడిగా తెలుసుకునిన, మరియు ఆ దేవదేవుడు, సమస్త లోకాలకు ప్రభువని, అన్ని జీవులకు మిత్రుడు అని తెలుసుకునిన [అటువంటి కర్మ యోగి] వారికి శాంతి లభిస్తుంది.

వివరణం : కృష్ణుడు, తనను లక్ష్యము గా కలిగి ఉండటం ముఖ్యం అని చెప్తూ ముగిస్తున్నాడు.

ఆడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-5/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment