శ్రీ భగవత్ గీతా సారమ్ – అధ్యాయం 6 (అభ్యాస యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 5

గీతార్థ సంగ్రహం లోని 10వ శ్లోకం లో, ఆళవందార్లు ఆరవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “ఈ ఆరవ అధ్యాయంలో యోగం(ఆత్మ సాక్షాత్కారం పొందే) అనుసరించే పద్ధతి, నాలుగు రాకాల యోగములు, అభ్యాసం, మరియు తన పట్ల చేసే భక్తి యోగం యొక్క గొప్పతనం చెప్పబడ్డాయి.”

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ. అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః । స సన్యాసి చ యోగీ చ నా నిరగ్నీర్ నా చాక్రియః ॥

ఎవరు అయితే కర్మ యోగం కేవలం అనుసంధించటానికే పాటిస్తూ, కర్మ ఫల అపేక్ష అనగా స్వర్గం మొదలు అయినవి లేకుండ, జ్ఞాన యోగ నిష్ఠులు గా ఉన్నవారు; వారు కర్మ యోగ నిష్ఠులు గా కూడా అవుతారు; వారు యజ్ఞాది కర్మలు నుండి విముక్తుడు అవ్వరు, అలాగే జ్ఞాన యోగ నిష్ఠుడు కూడా అవ్వలేడు (సరైన కర్మలు లేకుండా జ్ఞానం మాత్రమే ఆర్జించే వారు జ్ఞాన యోగ నిష్టుడు అవ్వలేడు).

వివరణం : మొదటి తొమ్మిది శ్లోకాల్లో, కృష్ణుడు మళ్లీ జ్ఞాన యోగం తో కూడిన కర్మ యోగం గురించి వివరిస్తున్నాడు.

శ్లోకం 5

ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానమవసాధ్యయేత । ఆత్మాయివ హ్యాత్మనో బాంధూర్ ఆత్మైవ రిపుర్ ఆత్మనః ॥

ఒక్కరు తన మనసు ని ఉద్ధరించుకోవాలి (సంసారిక సుఖాల నుండి విముక్తుడు అవ్వాలి); తనను తాను క్రిందికి సంసారిక సుఖాల వల్ల దిగజార్చుకో కూడదు; తన మనసు మాత్రమే తనకి మిత్రుడు/బంధువు (సంసారిక సుఖాం నుండి దూరం అవుతే) మరియు శత్రు (ఎప్పడు సంసారిక సుఖాల్లో మునిగినప్పుడు) కూడా.

వివరణం : ఆత్మ ఉద్ధరణకి మనసు యొక్క తోడ్పాటు ఇక్కడ ముఖ్యముగా చెప్పబడింది.

శ్లోకం 10

యోగీ యుంజీత సతతం ఆత్మానం రాహసి స్థితః । ఏకాకీ యథాచిత్తాత్మ నిరాశీర్ అపరిగ్రహః ॥

అట్టి కర్మ యోగి, ప్రతి రోజు, యోగం కోసం నిర్ధారించిన సమయం లో, ఒక్క ఏకాంత స్థలం లో, భ్రమించే మనసు ని నియంత్రించి, నిష్కామముగా, ఎటువంటి సంబంధము లేకుండ (ఇటువంటి విషయాల్లో), ధ్యాన మగ్నుడు అవుతాడు మరియు తనను చూస్తాడు.

వివరణం : 10వ శ్లోకం నుండి 28వ శ్లోకం వరకు, కృష్ణుడు యోగం అనుసందించే పద్ధతి వివరిస్తున్నాడు.

శ్లోకం 11

శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరం ఆసనం ఆత్మనః । నాత్యుచ్ఛ్రితం నాతినీచం చేలాజినకుషోత్తరం ॥

ఒకరు స్థిరమైన ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి.(చెక్కతో చేసినది మొదలైనవి),మరి ఎత్తుగా కాకుండా క్రిందికి కాకుండా, పట్టు వస్త్రము, జింక చర్మము మరయు కుశ(దర్బ) ఒక దాని పైన ఒకటి ఉంచి [వెతిరేక పద్దతి లో- అనగా మొదట గరిక ఆసనం , దాని పైన జింక చర్మం అటు పైన పట్టు వస్త్రం] ఒక శుద్ధమైన స్థలము లో వారికి వారు అమర్చుకోవాలి.

శ్లోకం 12

తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియాః । ఉపవిషయాసనే యుంజ్యాత్ యోగం ఆత్మవిశుద్ధయే ॥

ముందు వివరించిన ఆసనం పైన కూర్చుని [క్రిందటి శ్లోకంలో వివరించిన విధముగా], ఒకరు వారు మనసు ని ఏకాగ్రత తో, మనసు మరియు ఇంద్రియాలు నిగ్రహించుకుని, వారి ఆత్మ పైన దృష్టి కేంద్రీకరించి, బంధనాల నుండి విముక్తులు అవ్వాలి [ఈ సాంసారిక విషయాల నుండి].

వివరణం : 13 వ శ్లోకం లో, శరీర భంగిమ మరియు కళ్ళు నాసాగ్రమున ధ్యానించటం వివరించబడింది. 14వ శ్లోకం లో, బ్రహ్మచర్యం వివరించబడింది. ఇంద్రియ సుఖం నుండి విముక్తుడు అవటమే బ్రహ్మచర్యముగ అర్థం చేసుకోవాలి. 15 వ శ్లోకం లో, ఎవరు అయితే యోగం ఈ విధముగా అనుసరిస్తారో వారికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని వివరించబడింది. 16 మరయు 17 వ శ్లోకాల్లో, ఆహార నియమాలు మరియు నిద్ర అలవాట్లు ఉద్ఘటించబడ్డాయి. తర్వాత, మమకారం త్యజించటం వివరించబడింది.

శ్లోకం 29

సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చాత్మని । ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ॥

ఎవరి మనసైతే యోగం లో లగ్నమవుతుందో, అన్ని ఆత్మలల్లో(వస్తు సంబంధం అయిన) సమత్వ స్థితి చూస్తూ (జ్ఞానం ఆనందం మొదలు అయినవి స్వరుపం గా కలిగిన వారు), తనకు ఉన్న అదే స్వభావం సమస్త ఆత్మలల్లో ఉన్నట్టు గా అన్ని ఆత్మలల్లో ఉన్న అదే స్వభావం తాను కలిగిన వాడి లా భావించే వాడు.

వివరణం : సమస్త ఆత్మల పట్ల సమదృష్టి ఇక్కడ ఉద్ఘటించబడుతుంది. ఈ శ్లోకం మొదలు, నాలుగు శ్లోకాలల్లో నాలుగు విధముల భక్తులు వివరించబడ్డారు.

శ్లోకం 32

ఆత్మ ఉపమ్యేన సర్వత్ర సమం పాశ్యాతి యోఽర్జున । సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః ॥

ఓ అర్జున ! అన్ని చోట్లు, ఆత్మలు సమానత్వాన్ని కలిగి ఉన్నందున , (ఇతఃపూర్వం వివరించిన విధముగా), ఎవరైతే సమముగా సుఖాన్ని (తన శిశువు జన్మించినప్పుడు ఇత్యాది) మరియు దుఃఖం (తన సంతానం మరణించినప్పుడు ఇత్యాది) తనలో మరియు ఇతరుల్లో చూస్తాడో, అటువంటి యోగి ఉత్తముడిగా పరిగణించబడతాడు

వివరణం : రాబోవు రెండు శ్లోకాల్లో, అర్జునుడు కృష్ణుడికి మనసుని నియంత్రించటం గాలిని నియత్రించటం కన్నా కష్ట సాధ్యం అని వివరిస్తున్నాడు.

శ్లోకం 35

శ్రీ భగవాన్ ఉవాచ. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం । అభ్యాసేన తూ కౌంతేయ వైరాగ్యేన ఛ గృహ్యతే ॥

కృష్ణుడు బదులిస్తున్నారు :

ఓ మహాబాహు ! ఓ కుంతి పుత్ర ! ఇందులో ఎటువంటి సందేహం లేదు, చంచలమైన మనస్సు ని అదుపు చెయ్యటం కష్టమే; అయినను, సాధన చెయ్యటం (ఆత్మగుణాలు-ఆత్మ పై దృష్టి) మరియు వైరాగ్యం పెంచుకొవటం (సంసారిక దోషాలు చూపుతూ విషయాల్లో), అది నియంత్రించవచ్చు (కొంత వరకు అయిన).

వివరణం : 35 మరయు 36వ శ్లోకం లో, కృష్ణుడు వివరిస్తూ మనసు ని ఎలా నియంత్రించొచ్చ అని.

తర్వాత 3 శ్లోకాలు, అర్జునుడు అడుగుతూ ఎవరు అయితే యోగం మొదలు పెట్టి పూర్తి చెయ్యలేని వారి గతి ఏంటి అని.

40వ శ్లోకం నుండి, కృష్ణుడు అర్జునుడు ప్రశ్నకు సమాధానం చెప్తూ, అటువంటి భక్తులు మంచి అనుకూలమైన కుటుంబం లో పుడతారు మళ్లీ అక్కడ నుండి కొనసాగిస్తారు అని వివరించారు.

శ్లోకం 47

యోగినామపి సర్వేశాం మధ్గతేనా అంతరాత్మనా । శ్రద్ధావాన్ భజతే యో మామ్ స మే యుక్తాతమో ॥

ఏ వ్యక్తి మనసైతే నా లో నిమగ్నమై ఉందో,నన్ను చేరుకోవాలనే కోరిక ఉందో, మరియు నన్ను ధ్యానిస్తారో అటువంటి వాడు నా దృష్టి లో ఉత్తముడు, ముందు చెప్పిన యోగులు ఇతర తపస్విల కన్న (తపస్సు లో లీనమైన వారు)

వివరణం: కృష్ణుడు ఈ అధ్యాయం ముగిస్తూ చెప్పినది, ఎవరు తనపై పూర్తి నమ్మకం ఉంచుతాడో అటువంటి వాడు యోగుల కన్న శ్రేష్ఠుడు అంటున్నారు.

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-6/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org