శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< విషయ సారాంశం
గీతార్థ సంగ్రహం లోని 5 వ శ్లోకం లో ఆలవందార్లు ( యామునాచార్యులు) కృపతో అనుగ్రహిస్తూ మొదటి అధ్యాయం లోని సారాన్ని వివరిస్తున్నారు “ ధర్మ యుద్ధం అధర్మమైనది అనే ఆలోచన మదిలో పుట్టడంతో సతమతం అయిన అర్జునుడు నిశ్చేష్టుడు అయ్యాడు. దీనికి కారణం అర్హత లేని బంధువుల పైన పెరిగిన ప్రేమ, కరుణ లే. ఈ గీతా శాస్త్రం భగవంతుడు అనుగ్రహిస్తూ తనని మొదట యుద్ధానికి ప్రేరేపించారు.
శ్రీమహాలక్ష్మి కాంతుడు అయిన సర్వేశ్వరుడికి, రెండు లక్షణాలు ప్రధానం గా చెప్పుకోవచ్చు – సమస్త దోషాలకు అతీతుడిగా ఉండేవాడు మరయు సమస్త కళ్యాణ గుణాలకు నిలయుడు. ఆ సర్వేశ్వరుడి ఆధీనం లో రెండు లోకాలు ఉన్నాయి, మొదటిది పరమపదం అనబడు నిత్య విభూతి, రెండవది సంసారం అనబడు లీల విభూతి. ఆయనికి ఉన్న అనేక నామాలలో నారాయణ, పురుషోత్తముడు, పరబ్రహ్మం వంటి పేర్లుగల ఆ శ్రీమన్నారాయణుడు తన దివ్యమైన నోరు తెరిచి అత్యంత కరుణతో ఈ గీతా శాస్త్రాన్ని బద్ధ జీవాత్మలను ఉద్ధరించటానికి చెప్పారు. అతను అంత కరుణ తో ఈ శాస్త్రం మాట్లాడిన విధానం అద్వితీయం.
మొదట, అతను దూతగా వెళ్లి, దుర్యోధనుడు మొదలైన కౌరవులు, పాండవుల నడుమ యుద్ధం జరిగే విధంగా నిశ్చయించాడు. అర్జునుడికి సారథ్యం వహించాడు. అప్పుడు, యుద్ధానికై ఇరుపక్షాలు యుద్ధభూమిలో చేరిన తర్వాత, యుద్ధానికి సంసిద్ధుడు అయిన అర్జునుడి కోరిక మేరకు రథాన్ని ఇరుపక్షాల మధ్యలో నిలబెట్టాడు. అర్జునుడు, భీష్మ ద్రోణాదులను యుద్ధంలో చూసి దిగ్బ్రాంతుడు అయ్యాడు. తాను ఏమీ చెయ్యలేక భగవంతుడి ని ప్రశ్నిస్తూ యుద్ధం చెయ్యాలా లేదా అని స్వామి తో వాదిస్తూ , యుద్ధం వల్ల జరిగే అనర్థాలు వివరించాడు.
ఇది అంత కూడా శ్రీ కృష్ణుడి పరమ భక్తుడు అయిన సంజయుడు, తన గురువు అయిన వ్యాసుడి అనుగ్రహం చేత సాక్షీభూతుడు అయ్యి, ఇవన్నీ కూడా ధృతరాష్ట్రుడికి వివరించాడు, ఇవన్నీ తను మనోనేత్రలతో చూసినా కూడా బాహ్య నేత్రాలతో చూసిన విధంగా వివరించారు.
ఇవన్నీ శ్రీ గీతా శాస్త్రంలోని మొదటి అధ్యాయం లో చెప్పబడ్డాయి
కొన్ని ముఖ్యమైన శ్లోకాలు/చరణాలు
శ్లోకం 1
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సువః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ॥
ధృతరాష్ట్రడు ఇలా పలికాడు – ఓ సంజయ! ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో యుద్ధం కోసం కూడిన నా కుమారులు, మరయు పాండు కుమారులు ఏం చేశారు?
వివరణము : ఇక్కడ తన కుమారులు మరియు పాండవుల మధ్య ధృతరాష్ట్రుడికి ఉన్న పక్షపాత ధోరణి అవగతం అవుతుంది.
శ్లోకం 19:
స ఘోషో ధార్థరాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ । నభాశ్చ పృథివీం చైవ తుములో వ్యానునాదయాన్ ॥
శంఖాలు అన్ని ఒకేసారి పూరించడం తో ఆ నాదం, భూమి-ఆకాశాల లో వ్యాపించి, ధృతరాష్ట్రుని కుమారుల గుండెల లో భయం తో పగిలే ల చేశాయి.
వివరణము : ఇక్కడ కృష్ణుని పాంచజన్యం నుండి వచ్చిన శబ్దమే దుర్యోధనాదులకు యుద్ధం లో కలిగే పరాజయము మరియు వినాశనాన్ని నిశ్చయించాయి.
శ్లోకం 21:
హృషీకేశం తథా వాక్యమిదమాహ మహీపతే । అర్జున ఉవాచా – సేనయోర్ఉభయోర్ మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥
(సంజయుడు చెప్తూ) ఓ ధృతరాష్ట్ర, భూమికి నాయకుడు అయిన (అర్జునుడు) కృష్ణుడి తో ఇలా అన్నాడు “ఓ అచ్యుత! నా రథాన్ని రెండు సైన్యాలకు నడుమ నిలపెట్టుము”
వివరణం: ఇక్కడ అర్జునుడికి సారథ్యం చేస్తున్న (అధీనం లో) ఉన్న కృష్ణుడు, తన అశ్రిత పారతంత్ర్యం (భక్తుల కి కట్టుబడే) గుణాన్ని ప్రకాశింప చేస్తున్నాడు.
శ్లోకం 28:
కృపయా పరయావిష్ఠో వీషీదన్నిదం అబ్రవీత్ । అర్జున ఉవాచా. దృష్ట్వేమం స్వ-జనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం ॥
కరుణ మరియు దుఃఖ భరితుడు అయిన అర్జునుడు ఇలా పలికాడు “ ఓ కృష్ణ! నా వాళ్లు (బంధు-మిత్రులు) ఇక్కడ నా ముందర యుద్ధం చెయ్యటానికి నిల్చి ఉండటం చూసి…..”
శ్లోకం 29:
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి। వేపతుశ్చ శరీరే మే రోమహర్షస్చ జాయతే ॥
నా కాలు చేతులు దుర్బలం అవుతున్నాయి, నా నోరు ఎండిపోతుంది, నా శరీరం వణికిపోతుంది మరయు నా రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి.
శ్లోకం 30
గాండీవం శ్రంసతే హస్తాత్ త్వక్ చైవ పరిదాహ్యతే । నా చ శక్నోమ్యవస్థాతుం భ్రమదీవ చ మే మనః ॥.
నా ధనుస్సు గాండీవం నా చేతిలో నుండి జారుతుంది; నా చర్మం మండుతుంది; నాకు నిలుపడటానికి సరిపడే శక్తి కూడా లేదు; నా మనస్సు భ్రమిస్తుంది.
వివరణము : ఈ మూడు శ్లోకాలో, అర్జునుడు తన మనస్సు శరీరం రెండు తన బంధువులు, గురువులు మొదలైన వారిని చూసి నీరసించటం మరియు తన గుండెల్లో వారి పట్ల కలిగిన పరితాపం గురించి చెప్తున్నాడు.
ఇక ముందు రాబోవు శ్లోకాల్లో అర్జునుడు, తన బంధువులని చంపితే వచ్చే రాజ్యం తనకి వద్దు అని, యుద్ధాల వల్ల బలమైన నాయకుడు లేని కారణం చేత సంప్రదాయాలు నశిస్తాయి మరియు వర్ణ సంకరణం జరుగుతుంది అని, మరియు ఇటువంటి అధర్మమైన యుద్ధం చెయ్యటం కంటే మరణించటానికి అయినా సిద్దమే అని వాపోతాడు.
శ్లోకం 47:
ఏవముక్త్వ అర్జునః సంఖ్యే రథోపాస్త ఉపావిశత్ । విసృజ్య సశరంచాపం శోకసం విఘ్నమానసః ॥
ఇట్లు చెప్పిన అర్జునుడు దుఃఖ పూరితమైన మనస్సు తో తన ధనుర్-బాణాలని క్రింద పడేసి, యుద్ధ భూమిపైన తన రథం లోనే కూలిపోయాడు. ఇదంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి సంజయుడు వివరించాడు.
మూలం : https://githa.koyil.org/index.php/essence-1/
ఆడియెన్ ఆకాశ్ రామానుజ దసన్.
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org