శ్రీ భగవత్ గీతా సారం – 3 వ అధ్యాయం (కర్మ యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< 2వ అధ్యాయం

గీతార్థ సంగ్రహం లోని 7వ శ్లోకం లో ఆలవందార్లు 3వ అధ్యాయం సంగ్రహం గా వివరిస్తూ ఇలా సెలవిస్తున్నారు “మూడవ అధ్యాయం లో వివరించినది ఏం అనగా జనులని(జ్ఞాన యోగం పాటించలేని వారిని) రక్షించటానికి, ఆ వ్యక్తి తనకు నియమించిన కర్తవ్యాన్ని చేస్తూ, త్రిగుణాత్మమైన(మూడు గుణాలు అనగా సత్త్వం(ప్రశాంతత్వం), రజస్ (కోపం, మోహం…) తమాస్(అజ్ఞానం) చేత ప్రభావితమైన కర్తృత్వం(తన కర్తవ్యం పైన అధికారాన్ని) పైన ధ్యానిస్తూ, ఆ కర్తృత్వాన్ని భగవంతుడికి అర్పించి (కర్తవ్యాలని చేసి) ఫలం పైన మోక్షం తప్ప, వేరే అపేక్షలు లేకుండా ఉండటం.”

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

అర్జున ఉవాచ.

జ్యాయసీ చేత్ కర్మణాస్తే మతా బుద్ధిర్జనార్దన । తత్ కిమ్ కర్మణి ఘోరే మామ్ నియోజయసి కేశవ ॥

ఓ జనార్దన! ఓ కేశవ! ఒకవేళ మీ ధృఢమైన అభిప్రాయం; జ్ఞాన మార్గం, యుద్ధం వంటి క్రూరమైన కృత్యాల కన్నా శ్రేతమైనది అయితే నన్ను ఎందుకు యుద్ధానికి ప్రోత్సహిస్తున్నావు (అన్నాడు అర్జునుడు)

వివరణం : మొదటి రెండు శ్లోకాలలో, అర్జునుడు కృష్ణుడ్ని ప్రశ్నిస్తూ, జ్ఞాన యోగం కొన్ని సమయాల్లో మేలైనది అయినప్పుడు, కర్మ యోగంలో భాగమైన యుద్ధానికి ప్రోత్సాహం అందించటం వెనక దాగి ఉన్న కారణం తెలియచెయ్యమని కోరుతున్నాడు.

శ్లోకం 3

శ్రీ భగవాన్ ఉవాచ.

లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ । జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం ॥

ఓ పాప రహితుడా ! ఈ ప్రపంచం వివిధ రకాల వ్యక్తిత్వాలు కలిగిన వారితో నిండి ఉన్నది, [వాటి సమక్షం లో] రెండు రకాలు; గత అధ్యాయములో నా (అత్యంత కారుణ్యం, యధార్థముగా తత్వాన్ని వివరించే వాడు) చేత రమణీయం గా వివరించబడింది ; (అవి) జ్ఞాన యోగ స్థితి, జ్ఞానం కలిగిన వారికి మాత్రమే (తన ఆత్మ పైన దృష్టి కేంద్రీకరించిన వారు మరయు సాంసారిక సుఖాలకు లోబడని వారికి) మరయు కర్మ యోగ స్థితి, కర్మ యోగానికి అర్హులు అయిన వారికి (కారణం వారికి ఉన్న జ్ఞానం సాంసారిక సుఖాల పైన ఆశ కలిగిన వారి కోసం).

వివరణం : ఇక్కడ కృష్ణుడు చెప్ప తలిచినది “నేను స్వయం గా వీటిని అర్హత ఆధారంగా రెండు స్థితులుగా విభజించిన కారణం చేత, నా మాటలకు ఎదురు లేదు”.

శ్లోకం 4

న కర్మణాం అనారంభాన్ నైష్కర్మ్యం పురుషోఽష్నుతే । న చ సన్యసనాధేవ సిద్ధిం సమాధిగచ్చతి ॥

ఏ మానవుడు (సంసారం లో జీవించే వారు) కర్మ యోగం పాటించకపోవటం చేత జ్ఞాన యోగం పొందడు; లేదా తాను కర్మ యోగం విడిచి పెట్టటం చేత జ్ఞాన యోగం పొందడు (ఆరంభించిన కర్మయోగాన్ని).

వివరణం : ఇక్కడ ఒక్క విషయం సూచించ బడింది, ఎవరి మనస్సు అయితే కలిచి వెయ్యబడిందో, కర్మ యోగం చేత (ఒక రకమైన పరమాత్మ ఆరాధనం) తన మానసిక కలతలు తొలుగుతాయి మరయు అతను సరైన జ్ఞానాన్ని పొందుతాడు.

శ్లోకం 6

కర్మేంద్రియాణి సంయమ్య యా అస్తే మనసా స్మరన్ । ఇంద్రియార్థాన్ విమూదాత్మా మిథ్యాచారః స ఉచ్యతే ॥

ఎవరు అయితే జ్ఞాన (యోగం) పైన దృష్టి సారించి ఉంటారో, ఇంద్రియాలని పూర్తిగా నిగ్రహిస్తూ (విషయ వాసనలు పైన మనసు లగ్నం అవ్వకుండ), కానీ స్వరూప జ్ఞానం లేని హృదయం/మనస్సు కలిగిన వారు మరయు ఇంద్రియాలకు ఆహారం అయిన ఇంద్రియ సుఖాల (విషయ వాసనలు) గురించి ఆలోచించేవారు, లోప పూర్వకమైన క్రమశిక్షణ కలిగిన వారిగా చెప్పబడ్డారు

వివరణం : ఈ శ్లోకం మొదలు, కృష్ణుడు జ్ఞాన యోగం కన్నా కర్మ యోగం యొక్క గొప్పతనం వివరిస్తున్నారు.

శ్లోకం 9

యాగ్యార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః । తధర్థం కర్మ కౌంతేయ ముక్తసంఘః సమాచర ॥

యజ్ఞానికి విధించపట్ట కర్మలు కాకుండ మిగిలిన కర్మలు చేసినప్పుడు మాత్రమే, ఈ ప్రపంచం కర్మ చేత బంధించబడుతుంది. ఓ అర్జున! నువ్వు కర్మ బంధాలు లేని కర్మలు (యజ్ఞం లో భాగమైనవి) చెయ్యివలసింది

వివరణం : 10వ శ్లోకం మొదలు కృష్ణ భగవానుడు కర్మయోగం(భగవద్ ఆరాధన పద్ధతి) యొక్క భాగమైన యజ్ఞముల ప్రాధాన్యం వివరిస్తూన్నారు.

శ్లోకం 13

యజ్ఞ్యశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః । భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్ ॥

ఏ సత్పురుషులు అయితే యాజ్ఞ్య శేషాన్ని స్వీకరిస్తారో, వారు సకల పాపాల(ఆత్మ సాక్షాత్కారం మార్గం లో అవరోధాలు) నుండి విముక్తులు అవుతారు; ఎవరు అయితే వారి ఆకలి కోసం మాత్రమే వండుకుని తింటున్నారో వారు పాపులు, వారి పాపలన్నే తింటున్నారు.

వివరణం : 17వ శ్లోకం మొదలు కొన్ని శ్లోకాల వరకు, కృష్ణుడు ఇక్కడ, ఆత్మ సాక్షాత్కారం కోసం అర్జునుడు కేవలం కర్మ యోగం మాత్రమే సాధన చెయ్యాలి అని నిర్దేశిస్తున్నాడు.

20వ శ్లోకంలో, కృష్ణుడు ఎలా జనక మహారాజు కర్మ యోగం ద్వార మోక్షం సాధీంచారో వివరించారు.

శ్లోకం 21

యద్యద్ ఆచారతి శ్రేష్టస్తత్ తథేవేతరో జనః । స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ॥

ఏ కర్మలు అయితే వివేకవంతులు(జ్ఞానం మరయు అనుష్టానం కలిగిన వారు) ఆచరిస్తారో, సామాన్యులు వాటిని ఆచరిస్తారు. ఎలా అయితే వివేకవంతులు ఆచరిస్తారో, సంసారంలో సామాన్యులు అంత మాత్రమే ఆచరిస్తారు.

వివరణం : తర్వాత రెండు శ్లోకాల్లో, కర్మ బంధనం లేనప్పుడు కృష్ణుడు కర్మలు ఎందుకు ఆచరిస్తున్నాడో వివరిస్తున్నారు.

శ్లోకం 27

ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మణి సర్వశః । అహంకార విమూడాత్మ కర్తాహం ఇతి మన్యతే ॥

ఎవరి ఆత్మ అయితే మూడు గుణాల చేత(సత్వ, రాజో,తమో), అహంకారం(శరీరమే ఆత్మ అని భ్రమిచటం) చేత మూత పడిందో, వారు అనేక విధాలుగా ఆచరించే వివిధ(త్రిగుణాత్మకమైన) కర్మలకు ‘తామే కర్త’ అనే ఆలోచనల వల్ల భ్రమిస్తారు.

శ్లోకం 30

మయి సర్వాణి కర్మణి సన్యస్యాధ్యాత్మచేతసా । నిరాశీర్ నిర్మమో భూత్వా యుద్యస్వ విగతజ్వరః ॥

పూర్తి ఆత్మజ్ఞానం తో, అన్ని కర్మలు సంపూర్ణం గా నాకు (అన్నిటికీ అంతర్యామి గా ఉన్న నాకు) సమర్పించు, కర్మఫలం మరయు “నేను కర్త ఇది నా కర్మ” అనే భావన పట్ల ఉన్న బంధాన్ని వదిలించుకో, అనాది కాలం గా సేకరించిన పాపాల భారం నుండి విముక్తుడవి అవ్వు, నీవు యుద్ధం చెయ్యి.

వివరణం : ఈ చివరి శ్లోకాలలో, కృష్ణుడు వివరిస్తూ జ్ఞాన యోగం కష్టసాధ్యమని మరయు ఆచరించే అప్పుడు దోషాలు సంభవించటానికి ఆస్కారం ఉన్నట్టు గా చెప్తున్నారు.

శ్లోకం 35

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వానుష్టితాత్ । స్వధర్మే నిధానం శ్రేయః పరాధర్మో భయావహః ॥

(శారీరక/భౌతిక విషయాలతో మమేకం గా ఉన్న వ్యక్తి కై) కర్మ యోగం స్వాభావికమైన మార్గం, సాధనలో దోషాలు ఉన్నప్పటికీ జ్ఞాన యోగం కన్న శ్రేష్టమైనది. జ్ఞాన యోగం,దోషరహితం గా ఆచరించ వలసింది మరయు ఇది ఇతరులకి వర్తిస్తుంది ( పెద్దగా ఆచరించనందు వలన). కర్మ యోగం ఆచరిస్తూ మరణించటం కూడా ఉత్తమమే (చేసిన కర్మలకు ఈ జీవిత కాలం లోనే ఫలం అందుకోక పోయినప్పటికీ), ఇది వ్యక్తిగత సాధన, కానీ జ్ఞాన యోగం ఇతరులకి వర్తించినపాటికీ భయాన్ని అందిస్తుంది (తప్పుగా ఆచరిస్తే పూర్తిగా సాధన నాశనం అవుతుంది కనుక).

వివరణం : ఇక్కడ, కొందరు స్వధర్మాన్ని వర్ణాశ్రమం ఆధారంగా ధర్మబద్ధమైన కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకుంటారు. అయితే ఈ శ్లోకం అర్జునుడికి కర్మ యోగం, జ్ఞాన యోగం మధ్య తేడా లో భాగంగా వివరించబడింది కాబట్టి, అర్జునుడి వంటి వ్యక్తికి, అతనికి అంత సహజంగా లేని జ్ఞాన యోగానికి బదులుగా అతనికి సహజమైన కర్మ యోగాన్ని అనుసరించడం మంచిదని కృష్ణుడు స్పష్టం చేశాడు

శ్లోకం 43

ఏవం బుద్ధేః పరం బుధ్ధ్వా సంస్థాభ్యాత్మానం ఆత్మనా । జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం

ఓ బలమైన బాహువులు కలిగిన వాడ! ఈ విధముగా స్థిరమైన చిత్తం కన్నా బలమైన కామం (ఆత్మ జ్ఞానాని అడ్డగించే) గురించి తెలిసిన వారై, మనసుని దృఢమైన జ్ఞానంతో నిర్దేశిస్తూ, అజేయమైన శత్రువు అయిన కామాన్ని సంహరించాలి.

ఆడియెన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-3/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org