1.21 హృషీకేశం

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం – 1

<< అధ్యాయం – 1, శ్లోకం – 20

శ్లోకం 

హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే

అర్జున ఉవాచ –

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేచ్యుత

 

ప్రతి పదార్థం 

మహీపతే – ఓ పృథ్వీ పాలకుడా! (ధృతరాష్ట్ర మహారాజా!)

హృషీకేశం – ఇంద్రియాలకు అధిపతి అయిన ఆ శ్రీకృష్ణునితో

ఇదం – ఈ విధమైన

వాక్యం – మాటలను

ఆహ – పలికెను

అచ్యుత – ఓ అచ్యుతా! (తనను నమ్ముకున్న భక్తులను ఎన్నటికీ విడవని స్వామీ!)

ఉభయోః సేనయోః మధ్యే – ఇరు పక్షాల (రెండు) సైన్యాల మధ్యలో

మే – నా యొక్క

రథం – రథాన్ని

స్థాపయ – నిలపవయ్యా / ఉంచుము

తాత్పర్యం 

(సంజయుడు ఇలా అన్నాడు) “ఓ పృథ్వీ పాలకుడవైన ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికెను — ‘ఓ అచ్యుతా! ఇరుపక్షాల సైన్యాల మధ్యలో నా రథాన్ని నిలపవయ్యా!’

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 1.22

మూలము : https://githa.koyil.org/index.php/1-21/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment