శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ||
ప్రతి పదార్థం
పరమేష్వాసః – గొప్ప ధనుర్ధారి
కాశ్యః చ – కాశీ రాజు
మహారథః – మహారథుడు / గొప్ప సారథి
శిఖండీ చ – మరియు శిఖండి
ధృష్టద్యుమ్నః – మరియు ధృష్టద్యుమ్నుడు
విరాటః చ – మరియు విరాట రాజు
అపరాజితా – అపజయం ఎరుగనివాడు
సాత్యకిః చ – మరియు సాత్యకి
తాత్పర్యం
గొప్ప విలుకాడైన కాశీరాజు, మహారథుడైన (గొప్ప సారథి అయిన) శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటరాజు మరియు అపజయం ఎరుగని సాత్యకి తమ శంఖాలను పూరించారు.
మూలము : https://githa.koyil.org/index.php/1-17/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org