శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యన్తి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసఙ్కరః ॥
ప్రతి పదార్థం
కృష్ణ – ఓ శ్రీకృష్ణా!
అధర్మాభిభవాత్ – అధర్మం ఒక వంశాన్ని ఆవరించినప్పుడు
కుల-స్త్రియః – వంశమునందలి స్త్రీలు
ప్రదుష్యన్తి – కలుషితలవుదురు (చెడిపోవుదురు)
వార్ష్ణేయ – వృష్ణికులశ్రేష్ఠుడవైన కృష్ణా!
స్త్రీషు దుష్టాసు – కుల స్త్రీలు భ్రష్టులైనప్పుడు
వర్ణ-సఙ్కరః – వర్ణసాంకర్యము
జాయతే – ఉత్పన్నమగును (కలుగును)
తాత్పర్యము
ఓ కృష్ణా! (వృష్ణివంశోద్భవుడా!) ఎప్పుడైతే అధర్మం ఒక వంశాన్ని ఆవహిస్తుందో, అప్పుడు ఆ వంశంలోని స్త్రీలు భ్రష్టులవుతారు. ఎప్పుడైతే కులస్త్రీలు భ్రష్టులవుతారో, అప్పుడు వర్ణసాంకర్యం (వర్ణముల కలయిక/మిశ్రమం) ఏర్పడుతుంది.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-41
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org