శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
అహో బత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయమ్ ।
యద్రాజ్యసుఖలోభేన హన్తుం స్వజనముద్యతాః ॥
ప్రతి పదార్థం
అహో బత – అయ్యో! ఎంత ఆశ్చర్యము, ఎంతటి శోచనీయము!
వయమ్ – మేము (మనము)
మహత్ పాపమ్ – మహాపాపమును
కర్తుమ్ – చేయుటకు
వ్యవసితాః – నిశ్చయించుకున్నాము (సిద్ధపడ్డాము)
యత్ – ఏలయనగా / ఎందుకనగా
రాజ్య-సుఖ-లోభేన – రాజ్యసుఖముల లోభముచేత (దురాశతో)
స్వ-జనమ్ – మన జనులను (బంధువులను)
హన్తుమ్ – చంపుటకు
ఉద్యతాః – ఉద్యుక్తులమైతిమి (ఉద్యమిస్తున్నాము)
తాత్పర్యం
అయ్యో! ఎంతటి దుఃఖకరం! రాజ్యపాలన మీద ఆశతో మరియు భోగభాగ్యాల దురాశతో, మేము మా స్వంత బంధువులనే చంపడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మహాపాపమైన ఆ బంధుహత్యను చేయడానికి మేము సాహసిస్తున్నాము!
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
పొందుపరచిన స్థానము- https://githa.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org