శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః .
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః
ప్రతి పదార్థం
హృషీకేశః – ఇంద్రియాధిపతి కృష్ణుడు
పాంచజన్యం – పాంచజన్య అనే మహా శంఖం
ధనంజయః – అర్జునుడు
దేవదత్తం – దేవదత్త అనే శంఖం
భీమకర్మా వృకోదరః – భయంకర కార్యాలు చేసే భీముడు
పౌండ్రం – పౌండ్ర అనే మహా శంఖం
తాత్పర్యం
హృషీకేషుడు (మనుష్యుల ఇంద్రియాలను నియంత్రించే శక్తి కలిగినవాడైన కృష్ణుడు) పాంచజన్యం అనే మహా శంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శంఖాలను పూరించారు. భయంకర కార్యాలు చేయగల భీముడు పౌండ్రం అనే మహా శంఖాన్ని ఊదాడు.
అడియేన్ లక్ష్మీ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-15/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org