శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
సంజయ ఉవాచ
ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరన్తపః ।
న యోత్స్య ఇతి గోవిన్దముక్త్వా తూష్ణీం బభూవ హ ॥
ప్రతి పదార్థం
సంజయః ఉవాచ – సంజయుడు ఈ విధముగా పలికెను
పరన్తపః – శత్రువులను భయకంపితులను చేసేవాడు / శత్రుంజయుడు
గుడాకేశః – నిద్రను, అజ్ఞానాన్ని జయించినవాడైన అర్జునుడు
హృషీకేశమ్ – సర్వేంద్రియాలకూ నియామకుడైన శ్రీకృష్ణుడితో
ఏవమ్ ఉక్త్వా – ఈ విధంగా పలికి
(అహమ్) – (నేను)
న యోత్స్యే (న యోత్స్యామి) – యుద్ధం చేయను
ఇతి – అని
గోవిన్దమ్ ఉక్త్వా – గోవిందుడైన కృష్ణుడితో స్పష్టంగా చెప్పి
తూష్ణీం బభూవ – నిశ్శబ్దమైపోయెను (మౌనం వహించెను)
(హ – నిశ్చయముగా / అర్జునుడి తీవ్రమైన శోక-భారాన్ని సూచిస్తుంది).
తాత్పర్యం
సంజయుడు ఈ విధముగా పలికెను – శత్రువులు ఎవరిని చూసి భయంతో వణికిపోతారో అటువంటి అర్జునుడు, హృషీకేశుడైన శ్రీకృష్ణుడితో ఈ విధంగా చెప్పిన పిదప, ‘గోవిందా! నేను యుద్ధం చేయను’ అని పలికి తీవ్ర శోకంతో నిశ్శబ్దమైపోయెను.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/2-9
పొందుపరచిన స్థానము – https://githa.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org