1.24 ఏవం ఉక్తో హృషీకేశో 

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.23

శ్లోకం 

సంజయ ఉవాచ

ఏవం ఉక్తో హృషీకేశో గుడాకేశేన భారత 

సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ 

ప్రతి పదార్థం 

సంజయ ఉవాచ – సంజయుడు ఇలా పలికెను

భారత – ఓ ధృతరాష్ట్ర మహారాజా! (భరతవంశ శ్రేష్ఠుడా!)

హృషీకేశః – ఇంద్రియ నియామకుడైన శ్రీకృష్ణుడు

గుడాకేశేన – నిద్రను జయించిన అర్జునునిచే

ఎవమ్ – ఈ విధముగా

ఉక్తః – పలుకబడినవాడై

ఉభయోః సేనయోః మధ్యే – రెండు సేనల మధ్య

రథోత్తమమ్ – శ్రేష్ఠమైన అట్టి రథమును

స్థాపయిత్వా – నిలిపి

తాత్పర్యం 

సంజయుడు ధృతరాష్ట్రుడితో ఈ విధంగా పలికెను! ఓ భరతవంశ శ్రేష్ఠుడవైన ధృతరాష్ట్రా! నిద్రను జయించిన అర్జునుడు ఈ విధంగా కోరగా, ఇంద్రియ నియామకుడైన శ్రీకృష్ణుడు ఆ శ్రేష్ఠమైన రథాన్ని రెండు సైన్యాల మధ్య తెచ్చి నిలిపాడు.

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 25

మూలము : https://githa.koyil.org/index.php/1-24

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org