శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకం
పశ్యైతాం పాండు పుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।।
ప్రతి పదార్థం
ఆచార్య – ఓ గురుదేవా!
తవ శిష్యేణ – నీ శిష్యుడైన
ధీమతా – తెలివైనవాడైన
ద్రుపద పుత్రేణ – పాంచాల దేశ రాజైన ద్రుపద మహారాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుని చేత
వ్యూఢామ్ – వ్యూహాత్మకంగా మోహరించబడిన
మహతీమ్ – అతి పెద్దదైన
ఏతామ్ – ఈ
పాండు పుత్రాణామ్ చమూమ్ – పాండవుల యొక్క సైన్యమును
పశ్య – ఒకసారి చూడుము
తాత్పర్యం
ఓ గురుదేవా! పాంచాల దేశ రాజైన ద్రుపద మహారాజు కుమారుడు మరియు నీ శిష్యుడు మరియు బుద్ధిమంతుడు అయిన ధృష్టద్యుమ్నుని చేత వ్యూహాత్మకంగా మోహరించబడిన పాండవుల యొక్క ఈ మహా సైన్యాన్ని ఒక్కసారి చూడుము.
ఆముక్త రామానుజ దాసి
శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org