1.2 – దృష్ట్వాతు

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1

శ్లోకం

సంజయ ఉవాచ
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।

ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।।

ప్రతి పదార్థం

రాజా దుర్యోధనః – రాజైన దుర్యోధనుడు

వ్యూఢం – వరుసగా నిలబడిన

పాండవానీకం – పాండవుల సైన్యం

దృష్ట్వాతు – చూసిన పిదప

తదా – ఆ సమయంలో

ఆచార్యం – ద్రోణాచార్యుని దగ్గరకు

ఉపసంగమ్య – సమీపించి

వచనం – ఈ క్రింది మాటలను

అబ్రవీత్ – పలికెను

తాత్పర్యం

సంజయుడు పలికెను ఈ విధముగా – రాజైన దుర్యోధనుడు, వ్యూహాత్మకంగా వరుసగా నిలబడిన పాండవుల సైన్యాన్ని చూసిన పిదప, ఆ సమయంలో ద్రోణాచార్యులుని సమీపించి ఆయనతో ఈ క్రింది మాటలను పలికెను.

ఆముక్త రామానుజ దాసి

శ్రీ తేజ రామానుజ దాసి

>> అధ్యాయం 1 శ్లోకం 3

మూలము : https://githa.koyil.org/index.php/1/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org