శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।।
ప్రతి పదార్థం
మహేష్వాసాః – గొప్ప ధనుర్ధారులు
యుధి – యుద్ధ విషయాలలో
భీమార్జున సమాః – భీముడు మరియు అర్జునులతో సమానమైనవారు
శూరాః – గొప్ప యోధులైన రాజులు
అత్ర – ఈ సైన్యమునందు (ఉన్నారు)
యుయుధానో – సాత్యకి
విరాటః చ – విరాట దేశ రాజు
మహారథః – గొప్ప రథ యోధుడు
ద్రుపదః – పాంచాల దేశ రాజైన ద్రుపద మహారాజు
తాత్పర్యం
ఈ సేనలో, యుద్ధ నైపుణ్యాలలో భీమార్జునులతో సమానులైన మహోన్నత విలుకాండ్రు ఉన్నారు; సాత్యకి,విరాట్ రాజు మరియు పాంచాల దేశ ప్రభువు అయిన మహారథి ద్రుపదుడు వంటి మహా యోధులు ఇక్కడ ఉపస్థితులై (సమరానికి సిద్ధంగా) ఉన్నారు.
ఆముక్త రామానుజ దాసి
శ్రీ తేజ రామానుజ దాసి
మూలం: https://githa.koyil.org/index.php/1-4/
పొందుపరచిన స్థానము- https://githa.koyil.org
ప్రమేయము (లక్ష్యము) – https://koyil.org
ప్రమాణము (గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (పూర్వాచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org