శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్లోకం
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥
ప్రతి పదార్థం
అన్యే – శేషించిన / మిగిలిన
బహవః శూరాః చ – మరియు అనేకమంది వీర పురుషులు (శూరులు)
మదర్థే – నా కోసమే / నా హితము కొరకై
త్యక్త జీవితాః – తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడినవారు
నానా శస్త్ర ప్రహరణాః – వివిధ రకాల ఆయుధాలను, శస్త్రాలను ధరించి ప్రయోగించగలవారు
సర్వే యుద్ధ విశారదాః – వీరందరూ యుద్ధ తంత్రమునందు అత్యంత నైపుణ్యము, సామర్థ్యము కలవారు
తాత్పర్యం
మరియు, నా కోసమే తమ ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడిన అనేకమంది శూరులు, వివిధ రకాల అస్త్రశస్త్రాలను ధరించినవారై, యుద్ధవిద్యలలో అత్యంత పరాక్రమవంతులు మరియు సమర్థులైన వీరంతా ఇక్కడ కొలువై ఉన్నారు.
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-9/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org