శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 9 (రాజ విద్యా రాజ గుహ్య యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 8

గీతార్థ సంగ్రహం లోని 13వ శ్లోకం లో, ఆళవందార్లు తొమ్మిదవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “తొమ్మిదవ అధ్యాయం లో, తన వైభవం, తను మానవ రూపం లో ఉన్నాకూడా ఉన్నతుడు, మహాత్ములు అయిన జ్ఞానుల యొక్క వైభవం (వీటితో పాటు) మరియు భక్తియోగం అనే ఉపాసన చక్కగా వివరించారు”.

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే । జ్ఞానం విజ్ఞానసహితం యత్ జ్ఞాత్వ మోక్ష్యాసేఽశుభాత్ ॥

శ్రీ భగవాన్ చెప్తూ :- నా పట్ల అసూయ లేని వాడవు, నేను నీకు వివిధ రకాల ఉపాసన గురించిన వివరణాత్మక జ్ఞానంతో ఉపాసన (భక్తి యోగ సాధన) గురించి నేను అత్యంత రహస్యమైన జ్ఞానం నీకు వివరిస్తాను, తెలుసుకోవటం వల్ల ప్రతి పాప/పుణ్యం నుండి విముక్తుడవు అవుతావు.

వివరణం : ఈ విలువైన జ్ఞానం నేరుగా భగవంతుడి నుండి పొందటానికి అర్హత ,తన పట్ల అసూయ లేకుండా ఉండటమే.

శ్లోకం 2

రాజవిద్యా రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం । ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం ॥

ఈ భక్తి యోగం విద్యలలో ఉత్తమం అయినది, రహస్యాలలో శ్రేష్టమైనది, పాపాలు హరించడానికి ఉత్తమమైనది, నా (కృష్ణ) అనుభవించటానికి గొప్పది, నన్ను పొందే మార్గం, ఆచరణలో సులభము మరియు అనశ్యం(ఫలితం అనుగ్రహించిన తర్వాత కూడా).

వివరణం : భక్తి యోగం యొక్క వైభవం ఇక్కడ వివరించబడింది.

తర్వాత శ్లోకం లో, కృష్ణుడు, భక్తి యోగం అనుసరించని వారు సంసారం లో కష్టపడుతారు అని మరియు వారు అనుసరించని కారణం దాని పైన విశ్వాసం లేకపోవటం అని వివరిస్తూన్నారు.

శ్లోకం 4

మయా తథం ఇదం సర్వం జగదవ్యక్తమూర్తినా। మత్స్తాని సర్వభూతాని నా చాహం తేశ్వవస్థితః ॥

ఈ లోకాలు అన్నీ (చేతన అచేతనులు తో చెయ్యబడింది) నా సూక్ష్మమైన అంతర్యామిచే వ్యాపించబడింది; అన్ని ప్రాణాలు నా లో (విశ్రమిస్తాయు) కానీ నేను వారిలో (విశ్రమించను). (వారు నాలో ఆధారపడి విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా).

వివరణం : ఈ శ్లోకం లో మరియు తర్వాత శ్లోకం లో, భగవానుడి వైభవం చెప్పబడింది. ఇది ఫలితం చెప్తూ భక్తి యోగం యొక్క వైభవం తెలపటానికి చెప్పటానికి.

శ్లోకం 5

న చ మత్స్తానీ భూతని పాశ్య మే యోగం ఐశ్వర్యం । భూతభృన్ నా చ భూతస్థో మమాత్మ భూతభావనః ॥

వారు నా లో లేరు (భోతికం గా నీరు కుండలో ఉంటుంది, కానీ వారిని నా సంకల్పంచే కలిగి ఉన్నాను); నా సంకల్పం తెలుసుకో, ఈశ్వరుని అనగా నా ఐశ్వర్యం తెలుసుకో, నేను అన్ని ప్రాణులను కలిగి ఉంటాను కానీ వారు నన్ను కలిగి లేరు (నేను కలిగిన విధముగా); నా సంకల్పం మాత్రమే వారి ఉనికి, ధారణ, నియంత్రణకు కారణం.

వివరణం : ఎప్పడు అయితే భగవానుడు “వారు నా లో లేరు” అన్నారో, దాని అర్థం ఈ పదార్థాలు తన లో లేవు అని కాదు. నిశ్చయము గా భగవానుడు అందరికి విశ్రమ స్థానం. కానీ తను చెప్తుంది “నేను ఈ పదార్థాలల్లో ఉండి ధరించిన విధముగా, ఈ పదార్ధములు నా లో విశ్రమిస్తూ నన్ను ధరించవు”.

తర్వాత శ్లోకం లో, 5వ శ్లోకం లో చెప్పిన సూత్రానికి ఉదాహరణ ఇచ్చి వివరిస్తున్నాడు.

7వ శ్లోకం లో, తన సంకల్పం మాత్రమే అన్ని లోకాల ఉనికి క్రీయలను నిర్వహిస్తుంది అని వివరిస్తున్నాడు.

8వ శ్లోకం లో సృష్టి గురించి ఇంకను వివరించారు.

9వ శ్లోకం లో, తను ఈ సృష్టి స్థితి లయలలో పాల్గునప్పటికీ వాటి వల్ల ఎటువంటి దోషాలు తనకు ఉండవు అని చెప్తున్నాడు.

10వ శ్లోకం లో, ఈ కార్యాల ప్రాముఖ్యత వివరించబడింది.

శ్లోకం 11

అవజానంతి మామ్ మూఢా మానుషీం తనుం ఆశ్రితం । పరం భావం అజనంతో మమ భూతమహేశ్వరం ॥

మూఢులు, వారి అజ్ఞానం చేత నా పరమశ్రేష్ఠమైన స్థితి తెలియక నేను సర్వేశ్వరుడిని అయినా ఈ మనుష్య దేహం స్వీకరించిన నన్ను అవమానిస్తారు.

వివరణం : కృష్ణుడు, జనులకు తన వైభవము ప్రకటించినప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు అని కలత చెందుతున్నాడు. తర్వాత శ్లోకం లో తన వైభవం ఎందుకు జనాలు అర్థం చేసుకోలేకపోతున్నారో వివరించబడింది.

శ్లోకం 13

మహాత్మానస్ తు మాం పార్థ దైవీం ప్రకృతిం ఆశ్రితాః । భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిం అవ్యయం ॥

ఓ కుంతి పుత్రుడా ! కానీ జ్ఞానులు, మహాత్ములు, దివ్య స్వభావం పొందినవారు, నేను సమస్త ప్రాణులకు మూలమని తెలుసుకుని, నాశనము లేనివాడినని తెలుసుకుని, భక్తితో (నా పై) నిమగ్నమై ఇంకా ఏది మనసున తలవకుండా ఉండేవారు.

శ్లోకం 14

సతతం కీర్తయంతో మామ్ యథాంతాశ్ చ దృఢవ్రతాః । నమస్యంతశ్ చ మామ్ భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ॥

(ఈ జ్ఞానులు)ఎప్పడు నా పై భక్తి తో కీర్తిస్తారు, దృఢ సంకల్పం కలిగి, ప్రయత్నం చేస్తు (నా ఆరాధనకి), నాకు నమస్కరిస్తూ, నా తో ఉండటానికి పరితపిస్తూ, నా కోసం ధ్యానం చేస్తాడు.

తర్వాత శ్లోకం లో, కృష్ణుడు కొందరు ఎలా జ్ఞానం తో కొందరు తనను పూజిస్తారో వివరిస్తున్నాడు.

తర్వాత 4 శ్లోకాల్లో 16వ శ్లోకం మొదలు 19వ శ్లోకం వరకు, కృష్ణుడు ఎలా తనలో యజ్ఞ తత్త్వాలు ప్రకారం (విడతీయలేని తత్త్వం గా ) ఈ లోకం లో కలిగి ఉన్నాడో వివరిస్తున్నాడు.

తర్వాత 2 శ్లోకాల్లో, 20వ మరియు 21వ శ్లోకాల్లో, కృష్ణుడు ఎలా కొందరు లోకిక లాభాల వెనక మాత్రమే పరుగులు తీస్తారో వివరిస్తున్నాడు.

శ్లోకం 22

అనన్యాశ్ చింతాయంతో మామ్ యే జనాః పర్యుపాసతే । తీశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం ॥

మహాత్ములు, ఎవరు అయితే నేను తప్ప వేరే ప్రయోజనం లేక నన్ను ఆరాధిస్తారో (నా కళ్యాణ గుణాలు మరియు సంపదతో) మరియు నన్ను పొందాలి అనుకుంటారో, నేను వారికి యోగం(నన్ను పొందటానికి) మరియు క్షేమం(ఈ సంసారానికి తిరిగి రాకుండా) అనుగ్రహిస్తాను.

శ్లోకం 23

యే త్వన్యదేవతాభక్తా యజంతే శ్రద్ధయాన్వితాః । తేఽపి మామ్ ఏవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం ॥

ఓ కుంటి పుత్రుడా! ఎవరైతే ఇతర దేవతల పైన భక్తి కలిగి ఉంటారో(ఇంద్ర, రుద్ర మరియు బ్రహ్మ మొదలు అయిన) మరియు వారిని శ్రద్ధ తో యజ్ఞాదికాల తో ఆరాధిస్తారో(వారిని ఆరాధనకు అర్హులు అని భావించి), వారు కూడా యజ్ఞాధికాల తో నన్నే ఆరాధిస్తున్నారు కాని (వారు చేసేది) వేదసమతము కాదు (వారు ఈ యజ్ఞాధికాలు చేయాల్సింది నారాయణుడు అందరూ దేవతలకు అంతర్యామి అని తెలుసుకుని).

శ్లోకం 24

అహం హాయ్ సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభూర్ ఏవ చ । న తు మాం అభిజానంతి తత్వేనాథశ్ చ్యవంతి తే ॥

నేను మాత్రమే అన్ని యజ్ఞాలకు భోక్తను మరియు ఉపకారకుడను. ఎవరు అయితే పూర్వ భాగం మాత్రమే అనుసరిస్తారో (క్రియా భాగం), నన్ను పూర్తి గా తెలుసుకొజాలరు (అంతర్యామి గా) మరియు అందుకే వారు ప్రధానమైన ఫలితాలు కోలిపోతారు.

తర్వాత శ్లోకం లో, కృష్ణుడు ఎలా వివిధమైన లక్ష్యాలు కలిగిన వారు ఆయా ఫలితాలు పొందుతారో వివరిస్తున్నాడు.

శ్లోకం 26

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి । తదహం భక్త్యుపాహృతం అశ్నామి ప్రయతాత్మనః ॥

ఎవరైతే భక్తి తో ఆకు, పువ్వు, ఫలం లేదా నీరు కానీ అర్పిస్తారో, నేను అటువంటి శుద్ధమైన మనసు కలిగిన వారు ఇచ్చిన వాటిని స్వీకరిస్తాను/తింటాను/అనుభవిస్తాను.

వివరణం: కృష్ణుడి సౌలభ్యం (సులభంగా అందే) ఇక్కడ వివరించబడింది

తర్వాత శ్లోకం లో, ప్రతి పని తనకి అర్పణం గా చెయ్యాలి అని వివరిస్తున్నారు.

28వ శ్లోకం లో , కృష్ణుడు భక్తి యోగం ఫలితాలను వెల్లడిస్తున్నాడో.

శ్లోకం 29

సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి నా ప్రియః । యే భజంతి తు మామ్ భక్త్యా మయి తే తేషూ చాప్యహం ॥

నేను వివిధ జీవరాశులకు సమానుడను (నన్ను ఆశ్రయించాలనుకునే ఎవరికైనా) వివిధ జాతుల అన్ని జీవులకు; నా విషయానికొస్తే, నన్ను ఆశ్రయించడానికి ఎవరూ అనర్హులు కాదు (వారు తక్కువ స్థాయి వారు కాబట్టి) మరియు నన్ను ఆశ్రయించడానికి ఎవరూ అర్హులు కాదు (వారు ఉన్నతమైనవారు కాబట్టి); ఎవరు అయితే నన్ను ప్రేమ తో నాపై భక్తి పొందుతారు, వారు నాలో ఉంటారు మరియు నేను వారిలో ఉంటాను (వారి ప్రతి ప్రార్థన లో వారితో మాట్లాడుతాను).

శ్లోకం 30

అపి చేత్ సుదురాచారో భజంతే మామ్ అనన్యభాక్ । సాధుర్ ఏవ స మాంతవ్యః సమ్యగ్ వ్యవసితో హాయ్ సః ॥

వేరే కోరిక లేక నన్నే పూజించే వారు నీచ గుణాలు ఉన్న వారైనా, అతను జ్ఞానుల అంతశ్రేష్ఠుడు; తను కీర్తించ తగినవాడు. కారణం, తనకి నాపైన దృఢవిశ్వాసం మరియు అనుబంధం ఉంది.

ఈ శ్లోకం లో, కృష్ణుడు ఎలా తన భక్తులు తక్కువ సమయం లో గుణవంతులు అవుతారో వివరిస్తున్నాడు.

శ్లోకం 32

మామ్ హాయ్ పార్థ వ్యాపాశ్రితయ యేఽపి స్యుః పాపయోనయః । శ్రీయోః వైశ్యాస్ తతా శుద్రాస్ తేఽపి యాంతి పరాం గతిం ॥

ఓ కుంటి పుత్రుడా! ఆ స్త్రీలు , వైశ్యులు, శూద్రులు నీచమైన జన్మ ఎత్తినప్పటికీ నన్ను సరైన శరణాగతి చేత పొందగలరు మరియు పరమ పురుషార్థం పొందుతారు.

వివరణం : వైశ్యులు, శూద్రులు మహిళ లు ఇక్కడ నీచ జన్మ చెప్పేది వారి కర్మ, భక్తి, జ్ఞాన యోగం చెయ్యుటకు యోగ్యత లేని కారణం చేత, నిజానికి, ఈ సంసారం లోని అన్ని జన్మలు దుఃఖం అశాశ్వత తత్త్వం తో ముడిపడింది. కావున, అన్ని జన్మలు నీచమైనవే. భగవానుడు ఇక ముందు చివరన. శరణాగతి అందరికి సులువైన మార్గం అని వివరిస్తారు.

తర్వాత శ్లోకం లో, తను చెప్తూ బ్రాహ్మణులు మరియు రాజర్షులు, తన భక్తి కలిగి ఉంటే, తప్పకుండా వారూ ఫలితాన్ని అందుకుంటారు.

శ్లోకం 34

మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మామ్ నమస్కూరు । మామ్ ఏవైశ్యాసి యుక్తవైవం ఆత్మానామ్ మత్పరాయణః ॥

నీ మనసు నా పైన లగ్నం చెయ్యి. (అంతే కాక) నా పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉండు (అంతేకాక) నన్ను పూజించు. నాకు నమస్కారం చెయ్యి. నన్ను నీ చివరి విశ్రమ స్థలం గా ఎన్నుకో. నీ మనసు ఈ విధముగా అలవర్చు కోవటం చేత, నువ్వు తప్పక నన్ను పొందుతావు.

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-9/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment