శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
గీతార్థ సంగ్రహం లోని 17వ శ్లోకం లో, ఆళవందార్లు పదమూడవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పదమూడవ అధ్యాయం లో, శరీర స్వభావం, జీవాత్మ స్వభావం పొందే మార్గం, ఆత్మ మరియు అచిత్(శరీరం) మధ్య ఉన్న బంధానికి కారణం మరియు రెండిటి(ఆత్మ మరియు అచిత్) నడుమ బేధం కనిపెట్టే మార్గం చెప్పబడ్డాయ.”
ముఖ్యమైన శ్లోకాలు
శ్లోకం 1
శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభుధీయతే । ఎతద్ యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥
శ్రీ భగవాన్ మాట్లాడుతూ – ఓ అర్జున! ఈ శరీరం క్షేత్రము (మైదానం ఆత్మ సుఖాలకు) అని చెప్పబడింది . ఆత్మజ్ఞానులు (ఆత్మ గురించి జ్ఞానము ఉన్నవారు) ఈ శరీరం గురించి తెలిసిన వారిని క్షేత్రజ్ఞుడు (క్షేత్రం గురించి అవగాహన ఉన్నవాడని) అని అంటారు.
వివరణం : ఇక్కడ అర్జునుడు అడగకముందే కృష్ణుడు ఆత్మ శరీర తత్త్వం చెప్తున్నారు, కారణం అతనికి ఈ స్థాయి లో వాటి మధ్య ఉన్న బేధం తెలుపడం ముఖ్యం అనిపించింది.
శ్లోకం 2
క్షేత్రజ్ఞం చాపి మామ్ విద్ది సర్వక్షేత్రేషు భారత। క్షేత్రక్షేత్రజ్ఞోర్ జ్ఞానం యత్ తత్ జ్ఞానం మతం మమ ॥
ఓ భారత! నేను అన్ని దేహాలకు (దేవ మనుష్య మొదలైన క్షేత్రాలు) మరియు క్షేత్రజ్ఞులు గా చెప్పబడే ఆత్మలకు అంతర్యామి గా తెలుసుకో; ఈ జ్ఞానం “దేహం ఆత్మ వేరు మరియు వాటి రెండిటికీ నేను అంతర్యామి” ఇదే నిజమైన జ్ఞానం – నా దృష్టిలో
వివరణం : భగవాన్ తానే చిత్ అచిత్ పదార్థాలకు అంతర్యామి మరియు వాటిపై ఆధిపత్యం స్థాపిస్తున్నారు.
3వ శ్లోకం లో, మొదటి 2 శ్లోకాల్లో క్లుప్తముగా చెప్పిన రెండు తత్త్వాల స్వభావం వివరిస్తాను అని ప్రతిజ్ఞచేస్తున్నాడు.
4వ శ్లోకం లో, తను చెప్పిన ఆత్మ మరియు అచిత్ గురించిన శ్రేష్టమైన జ్ఞానం ఇంతకు పూర్వమే ఋషులు ద్వారా ,వేదం మరియు బ్రహ్మసూత్రంలో చెప్పబడింది అని వివరిస్తున్నాడు.
5వ మరియు 6వ శ్లోకాల్లో, క్లుప్తముగా అచిత్ ఆత్మకు క్షేత్రం అని వివరిస్తున్నాడు.
తర్వాత 5 శ్లోకాల్లో అనగా 7వ శ్లోకం నుండి 11వ శ్లోకం వరకు, కృష్ణుడు ఆత్మ సాక్షాత్కారం కోరుకునే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నారు. ఆత్మ సాక్షాత్కారం కి కారణమైన, వినయం, కీర్తిని కోరుకోకపోవడం, అహింసా, శాంతి, నిజాయితీ ఇత్యాది 20 గుణాలు తప్పకుండా ఉండాలి అని వివరిస్తున్నారు.
తర్వాత 6 శ్లోకాల్లో, అనగా 12వ శ్లోకం నుండి 17వ శ్లోకం వరకు, క్షేత్రజ్ఞుడి స్వభావం, చిత్/ఆత్మ , క్షేత్రం గురించి జ్ఞానం కలిగినది, ఆత్మ నిజ స్వభావం చాలా శుద్ధమైనది; శరీరం తో సంబంధం లేకున్నా వివిధ రకాల దేహాలు ధరించువాడు, ఆత్మలు అన్ని చోట్లా ఉంటాయి. తను చాలా సూక్ష్మమైన వాడు మరియు తెలుసుకోవటం కష్టం. అతను జీవుల హృదయంలో వసిస్తాడు. జ్ఞానం వల్ల మాత్రమే తను అవగతం అవుతాడు.
శ్లోకం 18
ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః । మద్భక్త ఏతద్ విజ్ఞాయ మధ్భావాయోపపద్యతే ॥
ఈ విధముగా, క్షేత్రం అయినా శరీరం, ఆత్మ జ్ఞానం పొందే మార్గం, ఆత్మ నిజ స్వభావం తెలుసుకోవాల్సినవి క్లుప్తముగా వివరించబడ్డాయి, వీటిని తెలుసుకున్న, నా భక్తులు సంసారం విడువుటకు సిద్ధం అవుతారు.
19వ శ్లోకం నుండి 22వ శ్లోకం వరకు, ఆత్మ అచిత్ మధ్య బంధం వివరించబడింది. ఈ బంధం అనాది (మొదలు లేని) గా చెప్పబడింది మరియు దీనికి కారణం ఎల్లప్పుడు కలసి ఉండటం. తను చాలా సూక్ష్మం మరియు అర్థం చేసుకోవడానికి కష్టమైన వాడు, తను ప్రాణుల హృదయం లో వసిస్తాడు, మరియు జ్ఞానం తో గ్రహించవచ్చు అని వివరిస్తున్నాడు.
శ్లోకం 23
యా ఏనం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ । సర్వతా వర్తమానోఽపి నా స భూయోఽభిజాయతే ॥
ఎవరు అయితే ముందు చెప్పిన విధముగా జీవాత్మ, ప్రకృతి(పదార్థం) మరియు సత్వ్త రజో తమస్ గుణాలు గురించి పూర్తిగా గా తెలుసుకుంటారో, వారు ఏ దేహం ఆశ్రయించి ఉన్నా, దేవ, మనుష్య, తిర్యాక్(జంతు) లేదా స్తావర(చెట్టు), తిరిగి జన్మించరు.
తర్వాత రెండు శ్లోకాల్లో, తను ఆత్మ జ్ఞాన దశలు వివరిస్తున్నాడు.
శ్లోకం 26
యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావరజంగమం । క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్ తద్ విద్ది భారతర్షాభ ॥
ఓ భారత కుల నాయకుడా ! పదార్థాలు అన్నీ తిరిగేవి(జంగమం) తిరుగనివి(స్థావరం) గా సృష్టించబడ్డాయి అని తెలుసుకో, పదార్థాలు అన్నీ క్షేత్ర(శరీరం) క్షేత్రజ్ఞ(ఆత్మ) అనే తత్త్వాల కలయిక తో సృజించబడ్డాయి.
27వ శ్లోకం నుండి అధ్యాయం చివరి దాకా, ఆత్మ అచిత్ మధ్య ఎలా విబేధించాలి అని వివరిస్తున్నాడు. ఆత్మ నాశనం లేనిది; అచిత్ అశాశ్వతం. ఆత్మ నియమించేది, అచిత్ నియమించబడేది; ఆత్మ కర్మలకి సాక్షం వంటిది; శరీరం కర్మ చేసేది.
శ్లోకం 34
క్షేత్రక్షేత్రజ్ఞాయోర్ ఏవం అంతరం జ్ఞానచక్షూష । భూతప్రకృతిమోక్షం చ యే విదుర్ యాంతి తే పరం ॥
ఎవరికి అయితే క్షేత్రం, క్షేత్రజ్ఞుడి మధ్య వ్యత్యాసం, ఈ వివిధ ప్రాణుల రూపం లోని అధిమ సృష్టి నుండి విముక్తి ప్రసాదించే అమానిత్వం ఇత్యాది గుణాలు, తెలుసో, వారు జ్ఞానదృష్టి ద్వార (శరీరం ఆత్మ మధ్య వ్యత్యాసం తెలిపేది) ఈ అధ్యాయం లో వివరించబడ్డ విధముగా, వారు పరమాత్మని పొందుతారు (సంసారం నుండి మోక్షం).
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
మూలము : https://githa.koyil.org/index.php/essence-13/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org