1.25 – భీష్మ-ద్రోణ-ప్రముఖతః 

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 1.24

శ్లోకం 

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |

ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ||

ప్రతి పదార్థం 

భీష్మ ద్రోణ ప్రముఖతః – భీష్ముడు, ద్రోణాచార్యుడు మొదలైనవారి ఎదుట

సర్వేషాం చ మహీక్షితామ్ – మరియు సమస్త భూపాలుర (రాజుల) ఎదుట

పార్థ – ఓ పృథా పుత్రుడా! (కుంతీదేవి కుమారుడవైన అర్జునా!)

సమవేతాన్ – సమకూడిన / చేరిన

ఎతాన్ కురూన్ – ఈ కౌరవులను (దుర్యోధనుడు మరియు కౌరవపక్షాన ఉన్న రాజులందరినీ)

పశ్య – తిలకించు / చూడుము

ఇతి – అని

ఉవాచ – పలికెను

తాత్పర్యం 

(గత శ్లోకానికి కొనసాగింపుగా – రథాన్ని భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర సమస్త రాజుల ఎదుట నిలిపి, శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను) “ఓ పార్థా! ఇక్కడ యుద్ధం చేయడానికి సమకూడిన దుర్యోధనుడిని మరియు కౌరవపక్షాన ఉన్న ఈ రాజులందరినీ ఒక్కసారి చూడుము!”

అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి 

>> అధ్యాయం 1 శ్లోకం 1.26

మూలము : https://githa.koyil.org/index.php/1-25

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment