శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
కథం న జ్ఞేయమ్ అస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన ||
ప్రతి పదార్థం
జనార్దన – హే జనార్దనా !
కుల క్షయ కృతం దోషం – ఒక కుల వంశాన్ని నాశనం చేసేటటువంటి తప్పుడు పని
ప్రపశ్యద్భిః – ఎవరికైతే స్పష్టంగా కనిపిస్తుందో
అస్మాభిః – మనము
అస్మాత్ పాపాత్ – ముందు చెప్పబడిన రెండు రకాల పాపాల
నివర్తితుం – నుండి దూరంగా ఉండడం
కథం న జ్ఞేయమ్ – ఎలా తెలియకుండా ఉండగలము
తాత్పర్యం
హే జనార్దనా ! ఒక కుల వంశాన్ని నాశనం చేసేటటువంటి తప్పుడు పని మనకు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, ముందు చెప్పబడిన రెండు రకాల పాపాల నుండి దూరంగా ఉండే మార్గం మనకు తెలియకుండా ఎలా ఉంటుంది?
అడియేన్ ఆముక్త రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-39/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org