1.13 తతః శంఖాశ్చ

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:

అధ్యాయం 1

<< అధ్యాయం 1 శ్లోకం 12

శ్లోకం

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః .

సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ 

ప్రతి పదార్థం

తతః – తరువాత

శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః  – శంఖాలు, భేరులు, చిన్న డప్పులు, పెద్ద డప్పులు, గోముఖాలు

సహసైవా – వెంటనే

అభ్యహన్యంత– మోగించబడ్డాయి

స శబ్దస్తుములోఽభవత్ – ఆ శబ్దం ఘోరంగా మారింది

తాత్పర్యం

తర్వాత శంఖాలు, భేరులు, చిన్న డప్పులు, పెద్ద డప్పులు, గోముఖాలు వెంటనే మోగించబడ్డాయి; ఆ శబ్దంతో యుద్ధరంగమంతా భీకరంగా ప్రతిధ్వనించింది. 

అడియేన్ లక్ష్మీ రామానుజ దాసి

>> అధ్యాయం 1 శ్లోకం 14

మూలము : https://githa.koyil.org/index.php/1-13/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org