శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః .
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ..
ప్రతి పదార్థం
ప్రతాపవాన్ – మహా శూరుడు
కురువృద్ధః పితామహః – కురు వంశంలో వృద్ధుడు, పితామహుడు భీష్ముడు
తస్య – దుర్యోధనునికి
హర్షం సంజనయన్ – ఆనందం కలిగించేందుకు
ఉచ్చైః సింహనాదం వినద్య – సింహంలా గర్జిస్తూ
శంఖం దధ్మౌ – శంఖాన్ని ఊదాడు
తాత్పర్యం
కురు వంశంలోని వృద్ధుడు, మహా శూరుడు భీష్ముడు, దుర్యోధనునికి ఆనందం కలిగించేందుకు, సింహంలా గర్జిస్తూ, తన శంఖాన్ని బిగ్గరగా పూరించాడు (ఊదాడు).
అడియేన్ లక్ష్మీ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-12/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.orgCategories