శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ ।
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ॥
ప్రతి పదార్థం
అథ – తదనంతరము / ఆ తర్వాత
తత్ర – అక్కడ (ఆ యుద్ధభూమిలో)
పార్థః – పృథాపుత్రుడైన అర్జునుడు
పితౄన్ – పితృసమానులైన వారిని [తండ్రి పక్షాన పెదనాన్నలు, పినతండ్రులు]
పితామహాన్ – తాతలను [భీష్ముని వంటి పితామహులను]
ఆచార్యాన్ – గురువులను [ద్రోణాచార్యుల వంటి వారిని]
మాతులాన్ – తల్లి పక్షాన మేనమామలను [శల్యుడు, శకుని వంటి వారిని]
భ్రాతౄన్ – అన్నదమ్ములను
పుత్రాన్ – కుమారులను [తన మరియు సోదరుల బిడ్డలను]
పౌత్రాన్ – మనుమలను
సఖీన్ (తథా) – మిత్రులను
అపశ్యత్ – చూచెను
తాత్పర్యం
ఆ తర్వాత ఆ యుద్ధరంగంలో అర్జునుడు తన పితృసమానులను (తండ్రి తరఫు పెదనాన్నలు, పినతండ్రులు), తాతలను, గురువులను, తల్లి తరఫు మేనమామలను, అన్నదమ్ములను, కుమారులను, మనుమలను మరియు మిత్రులను చూచెను…
అడియేన్ శ్రీ తేజ రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-26
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org