శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ||
ప్రతి పదార్థం
కృష్ణ – ఓ కృష్ణా !
విజయం న కాంక్షే – నాకు విజయంపై ఎలాంటి కోరిక లేదు
రాజ్యం – రాజ్యము
సుఖాని చ – మరియు సుఖముల యొక్క
న కాంక్షే – ఇచ్ఛ లేదు
గోవింద – ఓ గోవిందా !నః – మనకు
రాజ్యేన కిమ్ – ఈ రాజ్యం వల్ల ఏమి ఉపయోగం?
భోగైః – సమస్త భోగ వస్తువుల (పూల దండలు, ఆభరణములు) వల్ల
జీవితేన వా – ఈ జీవితం
వల్లకిమ్ – ఏమి ఉపయోగం ?
తాత్పర్యం
ఓ కృష్ణా (సమస్త భూమండలానికి ఆనందాన్ని కలిగించేవాడా)! నాకు విజయంపై ఎలాంటి కోరిక లేదు; రాజ్యాము మరియు సుఖములపై కూడా ఎటువంటి ఇచ్ఛ లేదు. ఓ గోవిందా (ఆవులను సంతోషపెట్టేవాడా; ఇంద్రియాలకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేవాడా)! మనకు ఈ రాజ్యం వల్ల ఏమి ఉపయోగం? ఈ సమస్త భోగ వస్తువుల వల్ల మరియు మన ఈ జీవితం వల్ల ఏమి ఉపయోగం?
అడియేన్ ఆముక్త రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-32
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org