శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమ: శ్రీమతే రామానుజాయ నమ: శ్రీమత్ వరవరమునయే నమ:
శ్లోకం
యేషామ్ అర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
తే ఇమేऽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ||
ప్రతి పదార్థం
యేషామ్ అర్థే – ఏ ఆచార్యుల కొరకైతే
నః – మనకు
రాజ్యం – రాజ్యము
భోగాః – సమస్త సుఖములు
సుఖాని చ – మరియు ఆనందము
కాంక్షితం – కోరబడినదో
తే ఇమే – ఆ ఆచార్యులందరూ
యుద్ధే – ఈ యుద్ధభూమిలో
ప్రాణాన్ – తమ ప్రాణములను (జీవితాన్ని)
ధనాని చ – మరియు సంపదను కూడా
త్యక్త్వా – త్యాగం చేసి (వదులుకుని)
అవస్థితాః – నిలబడి ఉన్నారు
తాత్పర్యం
ఏ ఆచార్యుల కొరకైతే మనము ఈ రాజ్యమును, సంపదను మరియు సంతోషములను కోరుకుంటున్నామో, ఆ ఆచార్యులందరూ తమ ప్రాణములను (జీవితాన్ని) మరియు సంపదను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడి, ఈ యుద్ధభూమిలో నిలబడి ఉన్నారు.
అడియేన్ ఆముక్త రామానుజ దాసి
మూలము : https://githa.koyil.org/index.php/1-33
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org