శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 12 (భక్తి యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 11

గీతార్థ సంగ్రహం లోని 16వ శ్లోకం లో, ఆళవందార్లు పన్నెండవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పన్నెండవ అధ్యాయంలో, ఆత్మోపాసనా (ఆత్మ అనుభవం) కన్నా భగవానుడి పట్ల భక్తి యోగం కు ఉన్న గొప్పతనం, భక్తి కలగటానికి ఉన్న మార్గాల గురించిన వివరణ, భక్తి యోగం చెయ్యలేని వారికి ఆత్మ అనుభవ ఉపాయం, కర్మ యోగాధికాలు చెయ్యటానికి కావాల్సిన వివిధ గుణాలు మరియు భక్తుని పట్ల భగవానుడికి ఉన్న విశేష అభిమానం, వివరించబడ్డాయి”

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా యే భక్తాస్ త్వం పర్యూపాసతే । యే చాప్యక్షరం అవ్యక్తం తేశాం కే యోగవిత్తమాః ॥

అర్జునుడు ప్రశ్నిస్తూ – ఒకరు నిష్ఠగా ఆరాధించే భక్తులు నీ సాన్నిధ్యం తప్ప వేరే కోరని వారు గత శ్లోకం లో వివరించిన వారు. మరొకరు ఇంద్రియాలకు అందని జీవాత్మని(స్వ ఆరాధికులు) ఆరాధించే వారు, ఇరువురి లో ఎవరు వారి లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు?

శ్లోకం 2

శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మామ్ నిత్యయుక్తా ఉపాసతే । శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః ॥

భగవానుడు చెప్తూ – ఎవరైతే నన్ను (లక్ష్యం గా) మహా విశ్వాసంతో నన్నే ఆరాదిస్తారో, నాతో ఎల్లప్పుడూ కూడి ఉండాలి అనుకుంటారో వారు నా దృష్టి లో శ్రేష్టమైన యోగులు.

3వ మరియు 4వ శ్లోకం లో, కృష్ణుడు చెప్తూ ఎవరు అయితే సంపూర్ణ సమర్పణ భావంతో వారిని వారు ధ్యానిస్తారో, వారు కూడా మోక్షం పొందుతారు (అదే, కైవల్య మోక్షం).

5వ శ్లోకం లో, కైవల్య మోక్ష సాధన, భగవత్ సాధన కన్నా కష్టతరం అని చెప్తున్నాడు.

6వ మరియు 7వ శ్లోకాల్లో, తనపై ధ్యానించు వారికి తాను రక్షకుడిగా ఉంటాను అని చెప్తున్నాడు.

శ్లోకం 8

మయ్యేవ మన ఆదత్సవ మయి బుద్ధిం నివేశయ । నివాసిశ్యసి మయ్యేవ అత్త ఊర్ధ్వం నా సంశయః ॥

నీ మనసు నా పైన లగ్నం చేసి, నా పైన పూర్తి విశ్వాసం ఉంచు(అంతిమ లక్ష్యంగా), ఈ సూత్రం పాటించడం వల్ల, సందేహం లేక నువ్వు నా లో వసిస్తావు.

వివరణం :ఈ శ్లోకం మొదలు నాలుగు శ్లోకాల్లో, తన పైన ప్రేమ ఎలా పెంచుకోవాలి అని వివరిస్తున్నాడు.

శ్లోకం 9

అత చిత్తం సమాధాతుం న శక్నోషి మాయి స్థిరం । అభ్యాసయోగేన తతో మామ్ ఇచ్చాప్తుం ధనంజయ ॥

ఓ అర్జున ! ఒకవేళ నువ్వు నా పైన దృష్టి సారించ లేకపోతే, నీ ఆలోచనలు (కళ్యాణ గుణాలు కలిగిన నా పైన) గొప్ప భక్తితో నియమించి (మనసు నా పైన లగ్నం అవుతుంది), ఆ కారణంగానే, నీకు నన్ను పొందాలి అనే ఆశ కలుగుతుంది.

శ్లోకం 10

అభ్యాసేఽప్యాసమర్తోఽసి మత్కర్మపరమో భవ । మతర్థం అపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవప్యసి ॥

ఒకవేళ నీకు నీ మనసుని నా మీద లగ్నం చేసుకో లేకపోతే, గొప్పనైన భక్తితో నా కార్యాలను చెయ్యి, ఇలా చెయ్యటం చేత నన్ను చేరుకోవచ్చు (శీఘ్రముగా అభ్యాస యోగం ద్వారా (నిరంతర అభ్యాసం) నీ మనసున నా పట్ల దృఢ విశ్వాసం చేత).

శ్లోకం 11

అతైతదప్యశక్తోఽసి కర్తుం మద్యోగం ఆశ్రితః । సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్ ॥

ఇప్పుడు, ఒకవేళ నీవు నా పట్ల భక్తి యోగం అనుసరించలేకపోతే (భక్తియోగం లో మొదటి అంకం), అప్పుడు స్వాధీనమైన మనసు తో, కర్మ ఫలాన్ని ,(జ్ఞాన యోగం లో భాగం గా) నాకు సమర్పించు. అది పరభక్తిని (భగవానుడి పట్ల సంపూర్ణ అనురాగం) కలిగిస్తుంది.

శ్లోకం 12

శ్రేయో హి జ్ఞానం అభ్యాస జ్ఞాద్ ధ్యానం విశిష్యతే । ధ్యానాత్ కర్మఫలత్యాగస్ త్యాగాచ్ చాంతిర్ అనంతరం ॥

భగవానుడి పట్ల భక్తి కంటే (నిజమైన ప్రేమ లేకుండా) ప్రత్యక్ష దృష్టి ప్రసాదించే జ్ఞానం (ఇటువంటి భక్తికి మార్గం) మేలైనది; (అసంపూర్ణ) ఆత్మసాక్షాత్కారం కన్నా ఆత్మ పైన ధ్యానం (ఆత్మజ్ఞానానికి మార్గం) మేలైనది. (అసంపూర్ణ) ధ్యానం కన్నా ఫలం పైన ఆశ త్యజించిన కర్మ (నిష్కామ కర్మ) (ధ్యానానికి మార్గం) శ్రేష్టమైనది, నిష్కామ కర్మ ఆత్మ శాంతి ప్రసాదిస్తుంది.

13వ శ్లోకం మొదలు 19వ శ్లోకం వరకు, కృష్ణుడు, తనకు ప్రియమైన కర్మయోగ నిష్ఠుల (పాటించేవారు) స్వభావం వివరిస్తున్నాడు.

శ్లోకం 20

యే తు ధర్మ్యామృతం ఇదం యథోక్తం పర్యూపాసతే । శ్రద్ధధానా మత్పరమా భక్తాస్ తేఽతీవ మే ప్రియాః ॥

ఎవరైతే ప్రాపకం(మార్గం) మరియు ప్రాప్యం(లక్ష్యం) అయిన భక్తి యోగాన్ని అభ్యసిస్తారో ,ఈ అధ్యాయంలోని 2వ శ్లోకం లో వివరించిన విధముగా, మహా విశ్వాసంతో, నాతో కూడి ఉండాలి అని ఆశించే వారు, నాకు ఎంతో ప్రియమైన వారు.

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-12/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org