శ్రీ భగవత్ గీతా సారం – అధ్యాయం 14 (గుణత్రయ విభాగ యోగం)

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

శ్రీ భగవద్ గీతా సారం

<< అధ్యాయం 13

గీతార్థ సంగ్రహం లోని 18వ శ్లోకం లో, ఆళవందార్లు పధ్నాలుగవ అధ్యాయం యొక్క సారాంశం వివరిస్తూ “పధ్నాలుగవ అధ్యాయం లో, ఎలా మూడుగుణాలు అనగా సత్వ, రజస్, తమో గుణం చేత ఈ సంసారం లో బద్ధులు అవుతారు, ఇటువంటి క్రియలకు కారణమైన గుణాల స్వభావం, వీటిని(గుణాలు) తొలిగించు మార్గాలు మరియు మూడు రకాల ఫలితాలకు(గొప్పని లౌకిక సంపద, ఆత్మానుభవం, భగవానుడిని పొందటం) భగవానుడే ఉపకరించు వాడని చెప్పబడింది.”

ముఖ్యమైన శ్లోకాలు

శ్లోకం 1

శ్రీ భగవాన్ ఉవాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం । యత్ జ్ఞాత్వ మునయః సర్వే పరాం సిద్ధిం ఇతో గతాః ॥

నేను ఈ శ్రేష్టమైన జ్ఞానాన్ని(ప్రకృతి,పురుషుడి గురించి తెలిపేది), (గతంలో చెప్పిన వాటికి భిన్నంగా వివరిస్తాను); అటువంటి జ్ఞానాన్ని పొందడం చేత, ఈ జ్ఞానం గురించి ధ్యానించే వారు, సంసారం లోనే అత్మ గురించి గొప్ప అనుభవం పొందుతారు.

శ్లోకం 2

ఇదం జ్ఞానం ఉపాశ్రిత్య మమ సాధర్మ్యం ఆగతాః । సర్గేఽపి నోపజాయంతే ప్రళయే నా వ్యతంతి చ ॥

ఎవరు అయితే ఈ జ్ఞానం పొందుతారో (వివరించబోయే), నాతో సమయం పొందుతారు మరియు ఇక్కడ సృష్టి లయాలకు గురి కారు.

3వ మరియు 4వ శ్లోకలో, భగవానుడు, ఆత్మ ప్రకృతి చేరిక తో సృష్టి వైవిధ్యం ఏర్పడింది, మరియు తన చే అమర్చబడింది అని చెప్తున్నాడు.

శ్లోకం 5

సత్త్వం రజస్ తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః । నిబద్నంతి మహాబాహో దేహే దేహీనం అవ్యయం ॥

ఓ మహాబాహు అయిన అర్జున! ఈ మూడు గుణాలు అనగా సత్త్వ, రజస్, తమస్, ఎప్పడూ శరీరం తో కలిసి ఉండటం చేత జీవాత్మను అతని శరీరం తో బంధిస్తాయి, జీవాత్మకు (స్వాభావికంగా) గుణాలు తో ఉండే మరియు శరీరం లో ఉండే, హీనత లేదు.

వివరణం : ఈ శ్లోకం మొదలు, కృష్ణుడు త్రిగుణాలు మరియు వాటి ప్రభావం విస్తారముగా వివరిస్తున్నాడు.

శ్లోకం 6

తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం । సుఖసంగేనా బద్నాతి జ్ఞానసంగేన చ అనఘ ॥

ఓ దోషంలేని వాడ (అర్జున)! సత్త్వ, రజస్ మరియు తమస్ అను మూడు గుణాలలో, సత్త్వం స్వాభావికం గా వ్యక్తపరిచేది అయినా కారణం చేత (ఆత్మ జ్ఞానం మరియు ఆనందం), అది నిజమైన జ్ఞానం ప్రసాదించి (ఆత్మకు) ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. అది ఆనందం మరియు జ్ఞానం పట్ల అనురాగం పెంచి బంధిస్తుంది(ఆత్మ జీవించే శరీరం తో).

శ్లోకం 7

రాజో రాగాత్మకం విద్ది తృష్ణసంగసముద్భవం । తన్ నిబద్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం ॥

ఓ కుంతీ పుత్రుడా! రజో గుణం కామానికి (స్త్రీ పురుషుల మధ్య) కారణం, శబ్దం ఇత్యాది వాటి ద్వార సంసారిక కోరికలకు, మరియు మిత్రులు/పుత్రుల పైన వ్యామోహం కలిగిస్తుంది అని తెలుసుకో; రజో గుణం శరీరం లోని ఆత్మ తో చేరి సంసారిక కర్మల పట్ల కోరిక కలగచేస్తుంది.

శ్లోకం 8

తమస్ త్వజ్ఞానజం విద్ది మోహనం సర్వదేహినాం । ప్రమాదాలస్యనిద్రాభిస్ తన్ నిబద్నాతి భారత ॥

ఓ భారత వంశస్థుడా! తమో గుణం తత్త్వాల స్వభావం అర్థం చేసుకోక పోవటం వల్ల ఏర్పడుతుంది; మరియు శరీరాలు కలిగిన ఆత్మలు అన్నిటికీ, ధర్మ వ్యతిరేకమైన జ్ఞానం కలిగిస్తుంది; అది ఆత్మతో చేరి అశ్రద్ధ, బద్ధకం మరియు నిద్ర కలిగిస్తుంది.

వివరణం : ఈ మూడు శ్లోకాలలో, మూడు గుణాల ఫలం విస్తారం గా వివరించబడింది.

9వ శ్లోకం లో, ప్రతి ఒక్క గుణం యొక్క ముఖ్యమైన కోణం వివరించబడింది.

10వ శ్లోకం లో, ఎలా ఒక్కో సమయం లో ఒక్కో గుణం ప్రబలం అవుతుందో వివరించబడింది.

11వ శ్లోకం నుండి 13 వ శ్లోకం వరకు, ఎలా ఒకో గుణం ప్రబలం అవుతుందో తద్వారా వాటి ఫలితం వివరించబడింది.

14వ శ్లోకం మరియు 15వ శ్లోకం లో, ఒక్కో గుణం ప్రబలం అయినప్పుడు ఒకవేళ శరీరం త్యజిస్తే కలిగే ఫలితం చెప్పబడింది, అది తర్వాత ఆ గుణానికి సరిపోయే తదుపరి జన్మను పొందడం అని వివరించబడింది.

16వ శ్లోకం లో, ఇటువంటి జన్మలు పొందిన తర్వాత కూడా తను ఇటువంటి గుణం ప్రకారమే ప్రవర్తిస్తారు అని వివరిస్తున్నాడు.

17వ మరియు 18వ శ్లోకాలల్లో, మనుష్యుల లోని ఈ గుణాల వల్ల కలిగే ఫలితాలు వివరించబడ్డాయి.

శ్లోకం 19

నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి । గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽదిగచ్చతి ॥

ఎవరు అయితే సత్వ గుణంలో స్థిరపడి ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి, సత్వం మొదలైన గుణాలకు భిన్నమైన ఆత్మను కర్తగా పరిగణించనప్పుడు, మరియు గుణాలను (కర్త) ఆత్మ (కర్త కానివాడు) కంటే భిన్నంగా పరిగణించినప్పుడు, అతను నా స్థితికి చేరుకుంటాడు.

20వ శ్లోకం లో, తన స్థితి పొందటం అంటే దుఃఖాల నుండి విముక్తుడై మరియు శుద్ధమైన ఆత్మ ని అనుభవించటం అని వివరిస్తున్నాడు.

21వ శ్లోకం లో, అర్జునుడు త్రిగుణాలకు అతీతుడు అయినవాడి స్వభావం వివరించమని అడుగుతున్నాడు.

22వ శ్లోకం లో, కృష్ణుడు వివరిస్తూ, ఎవరు అయితే త్రిగుణాలకు అతీతుడు అయినవాడు, వాంఛనీయం అయినదాన్ని అవాంఛనీయ మైనదాన్ని ద్వేషించడు లేదా ప్రేమించడు అని చెప్పాడు.

23వ శ్లోకం లో, అటువంటి వ్యక్తి మౌనం గా ఉంటారు, మరియు ఎటువంటి పరిస్థితుల లో చలించరు అని వివరిస్తున్నాడు.

24వ శ్లోకం మరియు 25వ శ్లోకం లో, త్రిగుణాలకు అతీతుడు అయిన వాడు మట్టిని, రాయిని, మరియు బంగారాన్ని ఒకే లాగా భావిస్తాడు, ఆత్మ శరీరం వేరు అని, స్తుతి అవమానాలు ఒకేలాగా చూస్తాడు, మిత్రుడు శత్రువు మధ్యలో బేధం ఉండదు, మరియు శరీరంతో బంధం కలిగించే అన్ని ప్రయత్నాలను విడిచి పెడతాడు అని చెప్తున్నారు.

శ్లోకం 26

మామ్ చ యో వ్యభిచారేన భక్తియోగేన సేవతే । స గుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే ॥

ఇతర దేవతలను ధ్యానించక వాటి వల్ల కలిగే ప్రయోజనం లెక్కచెయ్యక, ఎవరు అయితే భక్తి యోగం(వాటి అంగాల తో సహా) ద్వారా నన్ను ఆరాధిస్తారో, వాడు బ్రహ్మం తో సమానం గా ఉండేందుకు అర్హత పొందుతారు, త్రిగుణాలకు(సత్త్వ, రజస్, తమో) అతీతం అవుతారు.

శ్లోకం 27

బ్రాహ్మణో హి ప్రతిష్ఠాహం అమృతస్యావ్యయస్య చ । శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ ॥

దీనికి కారణం, నేను అమరుడిని మరియు ఆత్మ సాక్షాత్కారానికి నాశనరహితమైన (అనశ్యం)అయిన సాధనం. అలాగే, నేను గొప్ప ఐశ్వర్యానికి దారితీసే శాశ్వత ధర్మం, భక్తి యోగానికి నేనే సాధనాన్ని. మరియు నేను జ్ఞానులు అనుభవించే మహానందానికి కారణం.

అలాగే,

వివరణం : కృష్ణుడు, తనే ఐశ్వర్యం(భౌతిక సంపద) ,కైవల్యం(ఆత్మ అనుభవం) ,భగవత్ కైంకర్యం పొందేందుకు మార్గం అని తెలుసుకోమని ముగిస్తున్నారు.

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

మూలము : https://githa.koyil.org/index.php/essence-14/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org